అన్వేషించండి

Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు

మంచి వర్షాలు, పెరిగిన ఆదాయాలు, GST తగ్గింపుతో గ్రామీణ ప్రాంతాల్లో వాహన కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌లో వాహన డిస్పాచీలు కొత్త రికార్డులు సృష్టించగా, అర్బన్‌ మార్కెట్‌ మాత్రం నెమ్మదిగా ఉంది.

Rural Indian Auto Market Trends: ఈ పండుగ సీజన్‌లో, భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త ఊపిరి నింపింది రూరల్‌ ఇండియా. మంచి వర్షాలు, పెరిగిన వ్యవసాయ ఆదాయాలు, అలాగే GST రేట్లు తగ్గడం వల్ల చిన్న కార్లు, బైకులు, స్కూటర్లు మళ్లీ గ్రామీణ కొనుగోలుదారుల ఫస్ట్‌ ఆప్షన్‌గా మారాయి.

సెప్టెంబర్‌లో కొత్త రికార్డులు
సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (SIAM) తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ డిస్పాచీలు 4.4% పెరిగి 3,72,458 యూనిట్లకు చేరాయి. టూ వీలర్లు 6.7% పెరిగి 21,60,889 యూనిట్లు, త్రీ వీలర్లు 5.5% పెరిగి 84,077 యూనిట్లు అయ్యాయి.

“ఈసారి పండుగ సీజన్‌ తొందరగా ప్రారంభమైంది (నవరాత్రులు సెప్టెంబర్‌లోనే ప్రారంభం కావడం), అలాగే GST తగ్గింపుతో ప్రతి విభాగంలోనూ వృద్ధి కనపడింది. ఫ్యాక్టరీల నుంచి షోరూమ్‌లకు వెళ్లిన వాహనాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది" - SIAM అధ్యక్షుడు షైలేష్‌ చంద్ర

అర్బన్‌ మార్కెట్‌ను మించిన రూరల్‌ కొనుగోళ్లు
ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) CEO సహరాష్‌ దమానీ చెప్పిన వివరాల ప్రకారం, ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ సేల్స్‌లో రూరల్‌ వాటా 38% నుంచి 40%కి పెరిగింది, అర్బన్‌ వాటా మాత్రం 62% నుంచి 60%కి తగ్గింది. అంటే సెప్టెంబర్‌లో కొనుగోలు చేసిన ప్రతి 10 కార్లలో 4 కార్లు గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్ముడయ్యాయి.

“రూరల్‌ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 11% YoY పెరిగాయి, అర్బన్‌ మార్కెట్‌లో మాత్రం వృద్ధి కేవలం 2.6% మాత్రమే. ఇది తాత్కాలిక పెరుగుదల కాదు, భారత ఆటో మార్కెట్‌లో రూరల్‌ సెక్టార్‌ ప్రధాన శక్తిగా మారుతున్న సంకేతం” - సహరాష్‌ దమానీ

GST తగ్గింపుతో చిన్న కార్లపై ఆసక్తి
S&P గ్లోబల్‌లో ఆటో మార్కెట్‌ డైరెక్టర్‌ పుణీత్‌ గుప్తా మాట్లాడుతూ, “రూరల్‌ బయ్యర్స్‌ ప్రైస్‌ సెన్సిటివ్‌గా ఉంటారు. GST తగ్గింపుతో చిన్న కార్ల సెగ్మెంట్‌ మళ్లీ జోరందుకుంది” అన్నారు. సెప్టెంబర్‌లో అర్బన్‌ మార్కెట్‌లో PV (ప్యాసెంజర్‌ వెహికల్‌) సేల్స్‌ -10.17% తగ్గగా, రూరల్‌లో తగ్గుదల కేవలం -2.86% మాత్రమే తగ్గింది.

రెండో త్రైమాసికం అప్‌డేట్స్‌
జూలై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో టూ వీలర్‌ డిస్పాచీలు 7.4% పెరిగి 5.56 మిలియన్‌ యూనిట్లు, కమర్షియల్‌ వాహనాలు 8.3% పెరిగి 2.4 లక్షలు అయ్యాయి. ప్యాసింజర్‌ వాహనాలు మాత్రం 1.5% తగ్గాయి. SUV సెగ్మెంట్‌ ఇంకా ఆధిపత్యం కొనసాగించినా, సేల్స్‌ కొంత స్థిరంగా ఉన్నాయని SIAM పేర్కొంది.

రూరల్‌ మార్కెట్‌ - న్యూ ఇంజిన్‌ ఆఫ్‌ గ్రోత్‌
ఈ సెప్టెంబర్‌లో కనిపించిన ఈ ఉత్సాహం దీర్ఘకాలం కొనసాగుతుందా అన్నది నవంబర్‌–డిసెంబర్‌లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం - భారత ఆటో మార్కెట్‌లో ఇప్పుడు వేగం తెచ్చేది రూరల్‌ ఇండియానే. పెరిగిన ఆదాయాలు, తక్కువ పన్నులు, పెళ్లి సీజన్‌ కలయికతో ఈ సీజన్‌ ఆటో ఇండస్ట్రీకి “కొత్త శకం” మొదలయింది.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget