అన్వేషించండి

పెర్ఫార్మెన్స్‌, కంఫర్ట్‌, స్టైల్‌, ఆఫ్టర్‌-సేల్‌ సర్వీస్‌ - అన్నీ ఒకే కారులో కావాలంటే Hyundai Creta బెస్ట్‌!

Hyundai Creta Review: పర్ఫార్మెన్స్‌, మైలేజ్‌, కంఫర్ట్‌, ఆఫ్టర్‌-సేల్‌ సర్వీస్‌ అన్నీ బ్యాలెన్డ్స్‌గా కావాలంటే Hyundai Creta సరిగ్గా సరిపోతుంది. పీస్‌ ఆఫ్‌ మైండ్‌ ఉంటుంది!.

Best All-Rounder SUV Under 20 Lakh: ₹20 లక్షల లోపు పర్ఫార్మెన్స్‌, కంఫర్ట్‌, స్టైల్‌ - ఈ మూడూ కలిపిన కారు కావాలంటే హ్యుందాయ్‌ క్రెటా నిజంగా అద్భుతమైన ఆప్షన్‌. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాదు, ఓ పూర్తి ప్యాకేజ్‌. డ్రైవ్‌ చేయడం ఆనందంగా ఉంటుంది, రోజువారీ వాడకానికి కూడా అద్భుతంగా సరిపోతుంది.

పెర్ఫార్మెన్స్‌ & ఇంజిన్‌ ఆప్షన్లు         
హ్యుందాయ్‌ క్రెటా రెండు ప్రధాన ఇంజిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది, అవి -  డీజిల్‌ ఆటోమేటిక్‌ & 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌. మీరు లాంగ్‌ డ్రైవ్స్‌ ఎక్కువ చేస్తే, డీజిల్‌ ఆటోమేటిక్‌ SX(O) వేరియంట్‌ చక్కగా సరిపోతుంది. ఇది స్మూత్‌ డ్రైవ్‌ అనుభవాన్ని ఇస్తూ, సిటీ ట్రాఫిక్‌లోనూ సులభంగా నడుస్తుంది. టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ అయితే పవర్‌ ప్రేమికులకు పర్ఫెక్ట్‌ ఛాయిస్‌. స్పీడ్‌, రెస్పాన్స్‌ రెండూ అద్భుతంగా ఉంటాయి.

కంఫర్ట్‌ & మ్యూజిక్‌ సిస్టమ్‌        
హ్యుందాయ్‌ క్రెటా లోని బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌ అనుభవం మరో లెవల్‌లో ఉంటుంది. క్యాబిన్‌ ఇన్సులేషన్‌ చాలా బాగుండటంతో బయటి శబ్దాలు లోపలకు వినిపించవు. రోడ్డుపై కూడా కారు నిశ్శబ్దంగా సాగిపోతుంది. వెనుక సీటింగ్‌ కంఫర్ట్‌ కూడా చాలా బాగుంది. హైవేలోనైనా, గ్రామీణ రోడ్లలోనైనా సాఫీగా నడుస్తుంది.

బూట్‌ స్పేస్‌ & యుటిలిటీ          
బూట్‌ స్పేస్‌ పరంగా కూడా క్రెటా ముందంజలో ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్లు, ట్రిప్స్‌, పిక్నిక్స్‌ లేదా వీకెండ్‌ లాంగ్‌ డ్రైవ్స్‌ కోసం సరిపోయేంత సౌకర్యం ఉంది. కారు డిజైన్‌ కూడా క్లాసీగా ఉండి, రోడ్డుపైన స్టైల్‌గా కనిపిస్తుంది. మీ బంధుమిత్రుల్లో మీ లైఫ్‌స్టైల్‌ను మరో లెవెల్‌కు పెంచుతుంది.      

రిలయబిలిటీ & రీసేల్‌          
హ్యుందాయ్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా బలంగా ఉంది. మెయింటెనెన్స్‌ ఖర్చు తక్కువగా ఉండి, రీసేల్‌ విలువ కూడా బాగుంటుంది. చాలా మంది కొనుగోలుదారులు క్రెటాను “పీస్‌ ఆఫ్‌ మైండ్‌” కారు అని పిలుస్తారు.       

ప్రత్యామ్నాయాలు        
డ్రైవింగ్‌ ప్లెజర్‌ కోసం చూస్తే, వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ (Volkswagen Taigun) లేదా స్కోడా కుషాక్‌ ‍‌‍‌(Skoda Kushaq) 1.5 TSI DSG మోడళ్లు కూడా బాగుంటాయి. అవి మరింత రగ్డ్‌ లుక్‌తో ఉండి, అద్భుతమైన హ్యాండ్లింగ్‌ ఫీల్‌ ఇస్తాయి. అయితే ఈ కార్ల సర్వీస్‌ నెట్‌వర్క్‌ హ్యుందాయ్‌ లెవల్‌లో ఉండదు.

ధర
తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్‌ క్రెటా ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 10,72,593 నుంచి ప్రారంభం అవుతుంది. బేస్‌ వేరియంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 2.01 లక్షలు, బీమా కోసం రూ. 54,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. మొత్తం కలిపి, క్రెటా ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 13.39 లక్షలు అవుతుంది.

మొత్తానికి, కంఫర్ట్‌, పెర్ఫార్మెన్స్‌, ఆఫ్టర్‌-సేల్‌ సర్వీస్‌, రీసేల్‌, రిలయబిలిటీ అన్నీ సమతుల్యంగా కావాలంటే Hyundai Creta SX(O) నిజంగా “బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌” SUV. డీజిల్‌ కావచ్చు, టర్బో పెట్రోల్‌ కావచ్చు - ఈ రెండు వేరియంట్లూ మీకు సంతృప్తికమరైన డ్రైవింగ్‌ ఫీల్‌ ఇస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget