Maruti Swift, Wagon R మీద దీపావళి బంపర్ బెనిఫిట్స్ - ఈ లిస్ట్ ఇంకా ఉంది, రూ.57000 వరకు సేవింగ్
Maruti Swift Wagon R, Alto K10, Brezza, Celerio, S Presso కార్ల మీద అక్టోబర్‌లో 25,000-57,500 రూపాయల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఏ మోడల్‌పై ఏ ఆఫర్ ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Maruti Cars Diwali Discounts 2025: ఈ నెల (అక్టోబర్ 2025)లో, Maruti Suzuki Arena డీలర్లు.. మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు & SUV మోడళ్లపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, రూరల్ ఆఫర్స్‌ను అందిస్తున్నారు. అయితే, ఈ ఆఫర్స్ కొత్త Dzire & Ertiga MPV మీద వర్తించవు.
Maruti Swift
Swift ZXi పెట్రోల్ MT, AMT, CNG మోడల్స్‌లో మొత్తం డిస్కౌంట్స్ రూ. 57,500 వరకు ఉన్నాయి. LXi వేరియంట్‌లో 42,500 రూపాయల వరకు పొదుపు చేయవచ్చు. ఇందులో 10,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 7,500 రూపాయల ఇతర లాభాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో Swift ధరలు రూ. 5.78 లక్షలు - రూ. 8.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
Maruti S Presso
S Presso లో ప్రతి వేరియంట్‌కి 57,500 రూపాయల వరకు లాభాలు ఉన్నాయి. ఇందులో 25,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 9,000 రూపాయల ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. S Presso ధరలు రూ. 3.49 లక్షల నుంచి రూ. 5.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
Maruti Wagon R
ప్రతి వేరియంట్‌కి 57,500 రూపాయల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇందులో 25,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 9,000 రూపాయల ఇతర లాభాలు ఉన్నాయి. Wagon R ధరలు రూ. 4.98 లక్షలు - రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Maruti Alto K10
అన్ని వేరియంట్లలో 57,500 రూపాయల వరకు డిస్కౌంట్స్. 25,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 9,000 రూపాయల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ధరలు రూ. 3.69 లక్షలు - రూ. 5.44 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Maruti Celerio
47,500 రూపాయల వరకు డిస్కౌంట్స్. 15,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 9,000 రూపాయల ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ వెహికల్ ధరలు రూ. 4.69 లక్షలు - రూ. 6.72 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Maruti Eeco
42,500 రూపాయల వరకు డిస్కౌంట్స్. 10,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్, అదనంగా 7,500 రూపాయల ఇతర లాభాలు. ధరలు రూ. 5.90 లక్షలు - రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Maruti Brezza
25,000 రూపాయల వరకు డిస్కౌంట్స్. 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 25,000 రూపాయల స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. Brezza ధరలు రూ. 8.25 లక్షలు - రూ. 13.01 లక్షలు (ఎక్స్-షోరూమ్).
నగరం & స్టాక్ లభ్యతకు అనుగుణంగా ఈ డిస్కౌంట్స్ మారవచ్చు, కాబట్టి ఖచ్చితమైన సమాచారం కోసం లోకల్ డీలర్‌ని సంప్రదించండి.





















