By: ABP Desam | Updated at : 04 Jan 2023 08:30 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
శ్రుతి కడుపుతో ఉందని ప్రేమ్ అతి జాగ్రత్తలు తీసుకుంటాడు. పెదాల మీద అన్నం అంటుకుంటే ప్రేమ్ తుడిచేందుకు తన దగ్గరకి వెళ్తుంటే అంకిత, అభి, దివ్య వచ్చి ఆట ఆడుకుంటారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే లాస్య వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. అంకిత తల్లి కాలేకపోయిందని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు పెద్ద కోడలివి ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ కాలేకపోతున్నావ్ అని లాస్య అంటుంది. అందుకు నేనేమీ బాధపడటం లేదని అంకిత అంటుంది. కానీ లాస్య మాత్రం అంకితని బాధపెట్టేలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ విషయం అవసరమా అని అభి అంటాడు. లాస్య మాత్రం మీ మధ్య ప్రాబ్లం ఉందని అర్థం అయ్యింది, మీరు కలిసి ఉండటం లేదని అర్థం అయ్యింది. మనసులు దూరంగా ఉంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అని అంకితని చాలా బాధపడేలా మాట్లాడుతుంది.
మీ మధ్య గొడవలు ఏమైనా ఉంటే చెప్పండి నేను సాల్వ్ చేస్తాను అని అంటుంది. దివ్య లాస్యకి కౌంటర్ వేస్తుంది. ఒకరి నుంచి కుళ్ళుకునే మనస్తత్వం నాది కాదు మామధ్య గొడవలు పెట్టాలని చూడకు. నేనే దగ్గరఉంది శ్రుతికి పురుడు పోస్తాను అని అంకిత అంటుంది.
లాస్య: మీరిద్దరూ ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోండి ఎందుకైనా మంచిది కదా
ప్రేమ్: నిన్ను ఇన్వాల్వ్ అవొద్దని చెప్పాం కదా
Also Read: వేద మనసు ముక్కలు చేసిన యష్- షాకైన రాజా, రాణి
లాస్య మాటలకి అంకిత బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ వెళ్లిపోవడంతో లాస్య సంబరపడుతుంది. అనసూయ, పరంధామయ్య గుడికి వెళతారు. గుళ్ళో ప్రసాదం బాగుంటుందని అంటాడు. అదే గుడికి తులసి, సామ్రాట్ హనీని తీసుకుని వస్తారు. పరంధామయ్య గుడిలో ప్రసాదం ఎక్కడ పెడుతున్నారో అని వెతుక్కుంటూ ఉంటాడు. సామ్రాట్, తులసి హనీతో కలిసి పూజ చేసేసరికి పూజారి వాళ్ళని భార్యాభర్తలు అనుకుని మాట్లాడతాడు. తులసి తర్వాత పంతులుకి తాము భార్యాభర్తలు కాదని చెప్తుంది. మరి ఏమవుతాడని అనేసరికి స్నేహితుడు అని చెప్తుంది. అది విని ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళిపోతాడు.
అంకిత లాస్య మాటలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్, శ్రుతి, దివ్య అక్కడికి వస్తారు. నలుగురు సంతోషంగా ఒక దగ్గర కూర్చుంటే లాస్య తట్టుకోలేదు. నువ్వు ఏడుస్తుంటే ఆవిడ సంతోషంగా ఉంటుందని ప్రేమ్ అంటాడు. శ్రుతి నేను మొదట్లో సరిగా లేము తర్వాత ఇద్దరం ఒక తల్లి బిడ్డల్లా మారిపోయాము. శ్రుతి కడుపుతో ఉందని తెలియగానే అందరికీ కంటే నేనే ఎక్కువ సంతోషించాను. నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతుంది. పిల్లలు లేరనే బాధ నాకు ఉంటుంది. కానీ ఆ బాధ నావరకే ఉంచుకుంటాను అని అంకిత ఏడుస్తుంది. పుట్టబోయేది మన బిడ్డ తన మీద నాకు ఎంత హక్కు ఉంటుందో నీకు అంతే హక్కు ఉంటుందని శ్రుతి తనని ఓదారుస్తుంది. పూజ చేయించుకున్న తర్వాత మళ్ళీ పరంధామయ్య ప్రసాదం అని గోల చేస్తాడు.
Also Read: తులసిని కంపెనీ సీఈవో చేస్తానన్న సామ్రాట్- శ్రుతిని చంటిపాపలా చూసుకుంటున్న ప్రేమ్
ప్రసాదం తింటే కాస్త అయినా కడుపు నింపుకోవచ్చని బాధగా మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళి నోటికి కావలసింది అడిగి చేయించుకోలేము అని అంటాడు. ఆ మాటకి అనసూయ కూడా బాధగా వెళ్ళి ప్రసాదం తీసుకురమ్మని చెప్తుంది. పరంధామయ్య ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకొక కప్పు ఇవ్వమని అడుగుతాడు. ఇది ప్రసాదం అనుకున్నవా అన్నదానం అనుకున్నావా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తన కోసం కాదని తన భార్య కోసం అడిగాను అని చెప్తాడు. ఆ మాటకి ప్రసాదం పెట్టె వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అనసూయ వచ్చి అతన్ని తిడుతుంది.
తరువాయి భాగంలో..
తులసి సరుకులు తీసుకుని నందు ఇంటికి వస్తుంది. వీటిని ఎందుకు తీసుకొచ్చావ్ అని నందు తులసిని అడుగుతాడు. తన వాళ్ళు తిండి లేక అల్లాడిపోతున్నారని అందుకే తీసుకొచ్చానని చెప్తుంది. అప్పుడే శ్రుతి, అంకిత కూడా లాస్య పెట్టిన కండిషన్స్ గురించి చెప్పడంతో నందు ఉగ్రరూపం దాలుస్తాడు.
Ennenno Janmalabandham January 31st: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
Adhire Abhi Comments: మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి, ‘జబర్దస్త్’పై అదిరే అభి కామెంట్స్!
Gruhalakshmi January 30th: దివ్యకి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన తులసి ఫ్యామిలీ- ఆస్తి కావాలని అడిగిన నందు
Guppedanta Manasu January 30th: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?