By: ABP Desam | Updated at : 13 Apr 2023 07:27 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వేద బాధగా ఇంటికి వస్తుంది. యష్ ఎక్కడ అని రత్నం వేదని అడుగుతాడు. అర్జెంట్ కేసు వస్తే క్లినిక్ కి వెళ్ళి వస్తున్నానని చెప్తుంది. అప్పుడే యష్ తాగి తులుతూ ఇంట్లోకి వస్తాడు. ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావ్. గంట ముందు నిన్ను చూసి గర్వపడ్డాను. గంట తర్వాత నిన్ను చూసి సిగ్గు పడుతున్నా. నోటికి ఏది వస్తే అది వాగేస్తావా. నీ ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవా అని రత్నం నిలదీస్తాడు. రైట్ క్వశ్చన్ కానీ రాంగ్ పర్సన్ ని అడిగారు. ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవా అనేది నన్ను కాదు నీ క్వశ్చన్ కరెక్ట్ పర్సన్ ని అడగమని వేదని చూపిస్తాడు. రత్నం తిట్టబోతుంటే వేద అడ్డుపడి ఆయన మీ కొడుకు మాత్రమే కాదు నా భర్త కూడా. నా ముందు నా భర్తని ఇలా అరవడం కరెక్ట్ కాదు క్షమించండి అని వేద యష్ ని పట్టుకోబోతుంటే తనని పక్కకి తోసేస్తాడు.
Also Read: భర్త చేతికి సంకెళ్ళు వేసి అరెస్ట్ చేసిన జానకి- మనోహర్ ప్లాన్ ని తిప్పికొడుతుందా?
ఇంత జరిగినా కూడా నీ భర్తని వెనుకేసుకొస్తున్నావ్ చూడు నిన్ను చాచి లెంపకాయ కొట్టాలని ఉంది. కానీ కొట్టలేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావ్, నీకు చేతులెత్తి మొక్కాలని ఉంది కానీ మొక్కలేను. మేము నీకు తల్లిదండ్రులమే. మేము చేయగలిగింది ఒక్కటే చేతులెత్తి దీవించడమేనని మాలిని ఎమోషనల్ అవుతుంది. అందరికీ తెలిసింది ఏంటో తెలుసా ఆయనంటే నాకు చాలా ఇష్టం నాకు మాత్రమే తెలిసింది ఏంటో తెలుసా ఆయనకి నేను అంటే చాలా ఇష్టం అని వేద మనసులో అనుకుంటుంది. యష్ వేద పెట్టిన బ్రేస్ చూసుకుని బాధపడతాడు. అభిమన్యు చిత్ర ఫోటో చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడే మాళవిక వచ్చి ల్యాప్ టాప్ లో చిత్ర ఫోటో కనిపించేసరికి షాక్ అవుతుంది. చిత్ర నా లవర్ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అభి చెప్తాడు. మాళవిక కోపంగా అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అని అంటాడు.
చిత్ర ఫోటో మీద పెద్ద స్టోరీ అల్లుతాడు. పిచ్చిదానిలా మాళవిక అది నమ్మేస్తుంది. వేద యష్ కి భోజనం తీసుకుని వస్తుంది. తినమని బతిమలాడుతుంది కానీ యష్ కోపంగా ప్లేట్ విసిరికొడతాడు.
యష్: నా దగ్గరకి పొరపాటున వచ్చావా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లబోయి ఇక్కడికి వచ్చావా
వేద: మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు
యష్: కళ్ళతో చూసింది మాట్లాడుతున్నా. మనది వన్ ఇయర్ పెళ్లి అగ్రిమెంట్ అయిపోయిందని నేను ఏ మాట్లాడకూడదని అంటున్నావా
Also Read: తులసి ఇంట్లో సంబరంగా మొదలైన పెళ్లి పనులు- దివ్యకి ఫోన్ చేసిన ప్రియ
వేద: మన మధ్య ఉంది అగ్రిమెంట్ కాదు అంతకుమించి బంధం ఈ టైమ్ లో మీతో మాట్లాడటం కూడా అనవసరమని వెళ్లబోతుంటే గట్టిగా తన చేయి పట్టుకుని అపుతాడు.
యష్: చేయి వదిలితే ఎవడి చెయ్యి పట్టుకుందామని అనుకుంటున్నావ్. అసలు ఈ మధ్య నన్ను పట్టించుకుంటున్నావా నువ్వు
వేద; చూడంది నేను కాదు మీరు మీ మాటలతో అందరూ నన్ను చిన్న చూపు చూసేలా చేస్తున్నారు. నాకు మీరంటే ఎంత ప్రేమ ఉందో ఎంత ఆరాటపడుతున్నానో మీకు తెలుసు. కానీ మీకు నేనంటే ఇంత కూడా ఇష్టం లేదు
యష్ వెళ్ళి డోర్ గడి పెట్టి వేద దగ్గరకి వస్తాడు. తనని ముట్టుకోబోతుంటే ఏం చేస్తున్నారని అడుగుతుంది. భార్యాభర్తలం అని తెగ లెక్చర్ ఇస్తావ్ కదా మరి నేను ముట్టుకోకూడదా, నీ మీద నాకు హక్కు ఉంది కదా ఇప్పుడు నా హక్కు ఎంతో చూపిస్తానని వేద మీదకి వెళతాడు. దూరంగా ఉండమని అంటుంది. నాకు దూరంగా ఉంది మరెవరకి దగ్గర అవుదామని యష్ అడిగేసరికి వేద బాధగా తన చెంప పగలగొడుతుంది.
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ
Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!
Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా
Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?