Hanuman: ‘హనుమాన్’ విషయంలో ఏం జరిగింది? - క్లియర్‌గా మొత్తం చెప్పిన దిల్ రాజు!
Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘హనుమాన్’ థియేటర్ల విషయంలో ఏం జరిగిందో చెప్పారు.
Hanuman Theatres issue: 2024 సంక్రాంతి రిలీజుల్లో ‘హనుమాన్’ సినిమా విషయంలో బోలెడంత వివాదం నెలకొంది. ‘హనుమాన్’కు సరిపడా థియేటర్లు ఇవ్వడం లేదని, ఆ సినిమాను తొక్కేస్తున్నారని దిల్ రాజుపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. దీనిపై దిల్ రాజు స్పందించారు. ‘హనుమాన్’ విషయంలో ఏం జరిగిందో తెలిపారు. సోమవారం దిల్ రాజు ఒక సినిమా ఫంక్షన్‌లో దీని గురించి చెప్పాడు.
ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ ‘మీకు తెలియని వార్తలు రాస్తూ దానికి నన్ను ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక అన్నా కదా. తాట తీస్తా అని. దాన్ని ఈజీగా తీసుకోవద్దు. మీకు విషయం తెలియకుండా నాపై తప్పుడు రాతలు రాసినా, వివాదాలు చేసినా ఈరోజు నుంచి నేను ఊరుకోను. నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, దాంతో పాటు ‘హనుమాన్’. హనుమాన్ రిలీజ్ నేను ఆపమని చెప్పానని రాశారు. నేను ఆపాలని అడిగానా? నిర్మాతని, దర్శకుడిని పిలిచి సినిమాను 14వ తేదీన వేయమని అడిగాను. 12న మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14న చేస్తే మీ సినిమాకు ఉపయోగం, ఎక్కువ థియేటర్లు దొరుకుతాయని చెప్పా. దాన్ని కూడా ఇంకోలా మార్చి రాశారు. చిరంజీవి మాట్లాడింది ఇంకోలా రాస్తున్నారు.’
‘మీకు కావాల్సిన దాన్ని హైలెట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ లేకుండా పాజిటివ్‌గా బతికితే బాగుంటది. నెగిటివ్‌గా బతకడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయే వాళ్లమే. ఇక్కడ ఉండటానికి రాలేదు. మీ వెబ్‌సైట్లు, మీ ఛానెళ్లు ఇంప్రూవ్ అవ్వడం కోసం నెగిటివ్‌గా రాస్తారా? హనుమాన్ సినిమా తెలుగులో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తమిళం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. థియేటర్లు లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాంలో ఏడెనిమిది సెంటర్లలో హనుమాన్ సినిమా విడుదల అవుతుంది. ‘సైంధవ్’, ‘నా సామి రంగ’లకు థియేటర్ లేదు అక్కడ. మీకు తెలుసా అది. నాగార్జున, వెంకటేష్ అంటే చిన్న హీరోలు కాదు. 30 సంవత్సరాల నుంచి పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లకి కూడా థియేటర్లు లేవు. ఇవి మీకు కనిపించవు.’
‘ఈరోజు కొన్ని కోట్లు ఖర్చుపెడితే కానీ రానీ మైలేజీ హనుమాన్ సినిమాకు వచ్చింది. అది కూడా మంచిదే. చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారిలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే సినిమా ఆడితేనే మనం గ్లోబల్‌గా పెరుగుతాం. మన చేతుల్లో ఉండదు. మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్లీ మళ్లీ చెప్తున్నా. నా పేరు పెట్టి నా గురించి ఏమైనా తప్పుగా రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీ దగ్గర న్యూస్ ఉంటే రండి. 24 గంటలు అందుబాటులో ఉంటాను. నా పీఆర్వోలు కూడా మాట్లాడరు. నేనే మాట్లాడతాను. మీ మెసేజ్‌లకు, ఫోన్ కాల్స్‌కు నేను రిప్లై ఇస్తాను.’ అని తెలిపారు.
Also Read : చిరుత వేట అలాగే ఉంటుంది - 'OG' ఎప్పటికీ మాదే, ఆ వీడియోతో పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్!