అన్వేషించండి

Pawan Kalyan's OG : చిరుత వేట అలాగే ఉంటుంది - 'OG' ఎప్పటికీ మాదే, ఆ వీడియోతో పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్!

OG : పవన్ కళ్యాణ్ 'OG' మూవీ పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

Pawankalyan's OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాల కారణంగా తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్', 'OG', 'హరిహర వీరమల్లు' వంటి వరుస సినిమాలు చేస్తున్నారు. వీటిలో పవన్ ఫ్యాన్స్ 'OG' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్ తో మరింత హైప్ ని క్రియేట్ చేశారు.

పవన్ కళ్యాణ్ తో పాటు కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్, బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి స్టార్ కాస్ట్ కూడా సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. అదేంటంటే, ఈ సినిమా నిర్మాత చేతులు మారుతుంది అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. OG సినిమాని నిర్మిస్తున్న డివివి దానయ్య ఈ మూవీని పీపుల్స్ మీడియా వాళ్లకు ఇచ్చేస్తున్నారని సోషల్ మీడియా అంతటా పుకార్లు వినిపించాయి.

నిజానికి పవన్ తో సినిమా చేసేందుకు దాదాపు మూడేళ్లు వెంటపడి ఆయనతో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నారు డివివి దానయ్య. ఇలాంటి తరుణంలో ఆయన 'ఓజి' సినిమాని ఎలా వదిలేసుకుంటారనే చర్చ కూడా జరిగింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ ని ఏమాత్రం నమ్మలేదు. ఇక 'OG' పై వచ్చిన ఈ రూమర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

"OG మూవీ మాది. OG ఎప్పటికీ మాదే. పవన్ కళ్యాణ్ సినిమాను ఎలా తెరకెక్కించాలో మాకు తెలుసు. ఈ చిత్రాన్ని ఎంతో బాగా షూట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆకలి ఎక్కువగా ఉందని తెలుసు. కానీ చిరుత వేట కూడా అలాగే ఉంటుంది" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతో ఓజి నిర్మాత చేతులు మారింది అని వస్తున్న వార్తలకు చెక్ పడింది.

మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న పలువురు ఈ యాక్టర్స్ సినిమా గురించి చెబుతూ అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న శ్రియ రెడ్డి సలార్ ప్రమోషన్స్ లో భాగంగా OG గురించి మాట్లాడుతూ..' ఫ్యాన్స్ ఊహలకు అందని రీతిలో సినిమా ఉంటుందని, సలార్ ని మించి  ఉంటుందని' చెప్పిన విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : మరో వివాదంలో నయనతార భర్త - ఆ మూవీ టైటిల్‌పై LIC అభ్యంతరం, విగ్నేష్‌కు నోటీసులు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DVV Entertainment (@dvvmovies)

టాప్ హెడ్ లైన్స్

Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Manchu Manoj Reaction : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం - చేయాల్సింది చాలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం - చేయాల్సింది చాలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget