News
News
X

Devatha October 15th: రాధపై అధికారం చెలాయిస్తే సహించనని మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన రామూర్తి- కాడెద్దులుగా మారిన ఆదిత్య, రుక్మిణి

ఆదిత్య, రుక్మిణిని శాశ్వతంగా దూరం చేసి తన సొంతం చేసుకునేందుకు మాధవ్ సత్యని ఉసిగొల్పుతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

రుక్మణి నాగలి భుజానికెత్తుకుని పొలం దున్నుతుంటే మేము సాయం చేస్తామని దేవి, చిన్మయి కూడా వస్తారు. వాళ్ళని చూసి మురిసిపోతుంది భాగ్యమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బిడ్డ ఏమి రాలేదు. అప్పుడు నా కోసం, సత్య కోసం నాగలి లాగింది, ఇప్పుడు తన బిడ్డ కోసం నాగలి పట్టిందని భాగ్యమ్మ అనుకుంటుంది. మాధవ్ రావడం చూసి వెళ్లిపోదామని కదలబోతుంటే జానకి చైర్ లో నుంచి కింద పడిపోతుంది. వెంటనే మాధవ్, రామూర్తి వచ్చి పైకి లేపుతారు. మాధవ్ తల్లిని పైకి లేపే కంగారులో చేతి కర్ర పక్కన విసిరేసి రావడం రామూర్తి గమనిస్తాడు. చేతి కర్ర అక్కడ ఉంటే నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతాడు. అమ్మ పడిపోయిందనే కంగారులో చూసుకోలేదు నాన్న అనేసరికి రామూర్తి తీసుకెళ్ళి ఇస్తాడు.

మాధవ్ డ్రామా మొదలుపెడతాడు. అమ్మ నీకు బాగానే ఉంది కదా అని అడుగుతుంటే జానకి మాత్రం కోపంగా మొహం తిప్పేసుకుంటుంది. అమ్మని ఇలా చూడటం చాలా కష్టంగా ఉందని అనేసి మాధవ్ వెళ్ళిపోతాడు. వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో చూశావా జానకి, నువ్వు కింద పడిపోయావు అనగానే వాడిని వాడు మర్చిపోయి నీకు సహాయం చేస్తున్నాడు. వాడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందని అప్పుడు అన్నావ్ ఇప్పటికైనా అర్థం అయ్యిందా నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకున్నావ్ అని రామూర్తి అంటాడు.

Also Read: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి

రుక్మిణి వాళ్ళు ఉన్న పొలం దగ్గరకి ఆదిత్య వస్తాడు. చిన్మయి ఆనందంగా వెళ్ళి ఆదిత్యని కౌగలించుకుంటుంది, దేవి మాత్రం మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా దేవి నాతో మాట్లాడవా అని ఆదిత్య అడుగుతుంటే దేవి మాత్రం బాధగా ఉంటుంది. రుక్మణి, భాగ్యమ్మ ఎంత చెప్పిన కూడా వినదు. ఆదిత్య వచ్చి పలకరిస్తాడు. నా మీద కోపం పోవాలంటే ఏం చెయ్యాలి చెప్పు అని అడుగుతాడు. అమ్మతో కలిసి నాగలి పట్టి పొలం దున్నితే దేవి కోపం పోతుందని చిన్మయి అనేసరికి ఆదిత్య రంగంలోకి దిగుతాడు. ఆదిత్య, రుక్మిణి నాగలికి కాడెద్దులాగా మారి పొలాన్ని దున్నుతారు. చిన్మయి ఆదిత్యని ఫోన్ అడుగుతుంది. మిమ్మల్ని ఫోటోస్, వీడియో తీస్తానని చెప్తుంది. వీడియోలు, ఫోటోలు వద్దు అని చెప్పినా పిల్లలు మాత్రం తియ్యాలని అనుకుంటారు.

News Reels

సత్య ఫోటోస్ చూస్తుందని రుక్మిణి టెన్షన్ పడుతుంటే నువ్వేమి కంగారు పడకు అవి నేను డిలీట్ చేస్తానులే అని చెప్తాడు. తన పెనీమిటితో బిడ్డతో పచ్చగా ఉండాల్సిన నా బిడ్డ ఎట్లా అయిపోయిందని భాగ్యమ్మ బాధపడుతుంది. మాధవ్ కోపంగా వచ్చి రాధని పొలానికి ఎందుకు పంపించారని అడుగుతాడు. వెళ్తే తప్పేముంది పైగా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింది, ఇంట్లో అమ్మని చూసుకోడానికి మనం ఉన్నాం కదా అని రామూర్తి అంటాడు. అది కాదు నాన్న పొలంలో అటు ఇటు తిరిగి కష్టపడటం ఎందుకు అసలే ఇంట్లో అమ్మ పనులు చేస్తూ కష్టపడుతుంది కదా అని మాధవ్ అంటాడు. జానకికి అన్నీ తనే అయి చూసుకుంటుంది అందుకే కాసేపు తిరిగి వస్తుందని నేనే పంపించాను అని రామూర్తి అంటాడు.

Also Read: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ

నేను వెళ్ళి తీసుకొస్తానని మాధవ్ అంటే ఎందుకు ఆ అమ్మాయిని ఇది చెయ్యొద్దు అనే అధికారం మనకి లేదు నువ్వు గమ్మున ఉండు తనే వస్తుందని రామూర్తి సీరియస్ గా చెప్తాడు. ‘24 గంటలు మీ అమ్మని మన కన్నా ఎక్కువ చూసుకుంటుంది, అలాంటి అమ్మాయిని బయటకి వెళ్లొద్దని నేను ఎలా అంటాను, తిరిగింది చాలు అని నువ్వు ఎలా అంటావ్. రాధకి ఏ రోజు హద్దులు గీసి అధికారం చెలాయించే పని చెయ్యకు. ఆ అమ్మాయికి మన వల్ల చిన్న బాధ కలిగిన నేను సహించను’ అని కోపంగా చెప్తాడు.  

 

Published at : 15 Oct 2022 07:44 AM (IST) Tags: Suhasini devatha serial devatha serial today episode Devatha Serial Written Update Devatha Serial October 15th Episode

సంబంధిత కథనాలు

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం