అన్వేషించండి

Devatha October 14th Update: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ

ఆదిత్య, రుక్మిణి గురించి సత్య అపార్థం చేసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దేవి ప్రవర్తన గురించి చిన్మయి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన మాధవ్ తన దగ్గరకి వస్తాడు. నా బిడ్డని ఈ మధ్య దగ్గరకి తీసుకుని కూడా చాలా రోజులు అయింది, తను దేని గురించో బాధపడుతుందని మాధవ్ అనుకుని చిన్మయిని పలకరిస్తాడు. ఏంటి తల్లి అలా ఉన్నావ్ అని అడుగుతాడు. ఈ మధ్య నువ్వు ఎప్పుడు చూసిన ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అడుగుతాడు.. నాకేమీ ప్రాబ్లం లేదని చిన్మయి అంటుంది.

చిన్మయి: నాన్న.. నీకు నేనంటే నీకు ఇష్టమేనా.. ఆఫీసర్ అంకుల్ దగ్గరకి తీసుకున్నట్టు నువ్వు ఎందుకు దగ్గరకి తీసుకోవు. ఆఫీసర్ అంకుల్ మాట్లాడినట్టు కూడ నువ్వు ఎందుకు మాట్లాడవ్. ఆ అంకుల్ మా దగ్గరకి వచ్చి మాట్లాడి మమ్మల్ని ఆడిస్తాడు. నువ్వు ఎందుకు మాతో ఎప్పుడు అలా ఉండవు. నిజం చెప్పు నాన్న నేను అంటే నీకు ఇష్టం లేదు కదా

మాధవ్: అయ్యో అలా ఏమి లేదు తల్లి.. నేను కొంచెం పనిలో ఉన్నాను అందుకే ఈ మధ్య నీతో టైమ్ స్పెండ్ చేయడం లేదు. నీ మీద ప్రేమ లేకపోవడం ఏంట్రా

చిన్మయి: ఏమో నాన్న నాకు అలానే అనిపిస్తుంది. నాకు నాన్న ఉన్నా లేనట్టే అనిపిస్తుందనేసి వెళ్ళిపోతుంది

ఆ మాటలు విన్న రాధ మాధవ్ దగ్గరకి వస్తుంది. బిడ్డ బాధ ఇప్పటికైనా అర్థం అయ్యిందా, నీ బిడ్డ నిన్ను నాయన నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందంటే ఎంత బాధపడి ఉంటుంది.. ఇప్పటికైనా మారు నువ్వు మనిషిగా చచ్చిపోయి చాలా దినాలు అయింది, ఇప్పటికైనా మారు అప్పుడే నీ బిడ్డ నువ్వు బాగుంటారు అయినా ఇలాగే ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అనేసి రాధ వెళ్ళిపోతుంది.

Also Read: మాళవికకి కమ్మలు తొడిగిన యష్- నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించిన వేద

రాధ చిన్మయి గురించి తన బాధని తల్లి భాగ్యమ్మతో పంచుకుంటుంది. జానకిని రామూర్తి చక్కగా రెడీ చేస్తాడు. నాకు ప్రమాదం జరిగింది అంటేనే తట్టుకోలేకపోతున్నారు మాధవ్ వల్లే ఇలా జరిగిందని తెలిస్తే ఈయన ఏమైపోతారో అని జానకమ్మ దిగులుపడుతుంది. అప్పుడే దేవి, చిన్మయి వచ్చి అమ్మతో కలిసి పొలం వెళ్తున్నాం అని చెప్తారు. దేవుడు రాధకి చాలా ఓర్పు ఇచ్చాడని రామూర్తి మురిసిపోతాడు. రాధ నిజంగా మన ఇంటి మహాలక్ష్మి అని అంటాడు. మహాలక్ష్మి అని మనం అనుకుంటున్నాం కానీ తనని కష్టపెడుతున్నాడు మన కొడుకు అది మీకు ఎలా చెప్పాలి నేను చెప్పినది మీకు అర్థం కూడా కావడం లేదని జానకి మనసులోనే బాధపడుతుంది.

రుక్మిణి దేవి, చిన్మయిని తీసుకుని పొలానికి వస్తుంది. కష్టం అంటే ఏంటి అని అడిగారు కదా అది చూపిద్దామని తీసుకొచ్చాను అని రుక్మిణి పిల్లలతో చెప్తుంది. పంట పొలాలు గురించి చెప్తుంది. అవి వేసే విధానం గురించి చెప్తుంది. పంట దున్నాలంటే ట్రాక్టర్ కావాలి అది లేకుండా ఎలా అంటే రుక్మిణీ అక్కడే ఉన్న నాగలి చూపిస్తుంది. దీనితో ఎలా పొలం ఎలా దున్నుతారని చిన్మయి అడిగేసరికి రుక్మిణి పాత రుక్మిణిలా మారి దాన్ని భుజానికి ఎత్తుకుంటుంది.

Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

టాప్ హెడ్ లైన్స్

Aakasamlo Oka Tara First Day Collections : 'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు నెంబర్స్ ఎంతంటే?
'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు నెంబర్స్ ఎంతంటే?
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 21:రామలింగాన్ని ఇంటికి తీసుకొచ్చిన భరత్‌..పెళ్లికార్డు సెలక్ట్ చేయాలంటూ ఒత్తిడి
నువ్వులేక నేను లేను: రామలింగాన్ని ఇంటికి తీసుకొచ్చిన భరత్‌..పెళ్లికార్డు సెలక్ట్ చేయాలంటూ ఒత్తిడి
Salman Khan : 'భాయ్ వల్లే మీరు బతుకుతున్నారు' - నెగిటివిటీ ట్రోలింగ్స్‌పై సల్మాన్ ఖాన్ మాస్ కౌంటర్
'భాయ్ వల్లే మీరు బతుకుతున్నారు' - నెగిటివిటీ ట్రోలింగ్స్‌పై సల్మాన్ ఖాన్ మాస్ కౌంటర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Embed widget