అన్వేషించండి

Enneno Janmalabandham October 14th: మాళవికకి కమ్మలు తొడిగిన యష్- నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించిన వేద

వేదకి యష్ ని దూరం చేసేందుకు మాళవిక కుట్రలు చేస్తూనే ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద యష్ కోసం వెతుకుతూ ఉంటుంది. మాళవిక యష్ దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. అక్కడ అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ యశోధర్ ఏదైనా ముఖ్యమైన రోజుని గుర్తు చేసుకుంటున్నావా.. ఈరోజు డేట్ మర్చిపోయావా అని తను పెట్టుకున్న చెవి రింగ్స్ చూపిస్తుంది. వీటిని నువ్వు నాకు ఎంతో ఇష్టంగా కొనిచ్చావ్ గుర్తుందా అని అనడం వేద విని షాక్ అవుతుంది. నాకు అన్నీ గుర్తున్నాయ్ నువ్వు చేసిన ద్రోహంతో సహా అని యష్ కోపంగా అంటాడు. ఈరోజు ఆదిత్యకి ఎంత ఇంపార్టెంట్ రోజు అనే విషయం నీకు గుర్తుందా అని స్టెప్ సేల్స్ తీసి భధ్రపరిచావ్ మర్చిపోయావా. హాస్పిటల్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసే వాడివి కానీ ఈ సంవత్సరం మాత్రం నీకు గుర్తు లేదు కొత్త పెళ్ళాం మోజులో పడి కన్నకొడుకుని పట్టించుకోలేదని మాళవిక అరుస్తుంది.

Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

షటప్ మాళవిక.. ఇంత ముఖ్యమైన విషయం నేను మరచిపోవడం తప్పే కానీ దీని గురించి నువ్వు నాకు లెక్చర్ ఇవ్వొద్దు. బాధ్యత అనే పదం నీ నోటి నుంచి వింటుంటే చండాలంగా ఉందని అంటాడు. సరే నాకు బాధ్యత లేదు కానీ లాస్ట్ ఇయర్ కూడా మనం కలిసి లేము కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళావ్ ఆది పేరెంట్స్ గా మనం సైన్ చేశాం మరి ఈ సంవత్సరం ఏంటి ఆది మీద ప్రేమ చచ్చిపోయిందా అని నిలదిస్తుంది. దీన్ని మర్చిపోయి ఉండకూడదు నేను మర్చిపోవడం నా పొరపాటే అని యష్ అంటాడు. నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన నన్ను మాత్రం పట్టించుకోలేదు అలాగే ఆదికి సంబంధించిన విషయం కూడా నువ్వు మర్చిపోయావు అని మాళవిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది.

ఆ మాటకి యష్ మాళవికకి క్షమాపణ చెప్తాడు. నువ్వు నా పిల్లలకి తల్లివి, కాదని నేను అనను. ఈ ప్రపంచంలో నాకు ఆది తర్వాతే ఎవరైనా. నేను చచ్చిపోయినా వాడి మీద ప్రేమ మాత్రం పోదని అంటాడు. నా గురించి కాకపోయినా ఆది గురించి ఆలోచిస్తున్నావ్ చాలా థాంక్స్ అని మాళవిక చెప్తుంది. మాళవిక తన చెవికి పెట్టుకున్న రింగ్స్ తీసి యష్ కి ఇస్తుంది. అప్పుడు నా మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు కొనిచ్చావ్ ఇప్పుడు లేదు కదా వీటిని తీసుకెళ్ళి నీ కొత్త భార్యకి ఇవ్వమని అంటుంది. యష్ మాత్రం అదేంటి ఇవి నేను నీకు ఆది పుట్టిన తర్వాత వచ్చిన నీ బర్త్ డే కి ఇచ్చాను, వీటి ధర కూడా నాకు గుర్తు ఉంది, నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి కొనిచ్చాను అని చెప్తాడు.

Also Read: రాణికి బుగ్గచుక్క దిద్దిన రిషి, మురిసిన వసు, జగతి ఆనందం కోసం మరో అడుగు

ఇవి మన ఆదికి సంబంధించిన తీపి జ్ఞాపకం పెట్టుకో.. మనం ఇద్దరం విడిపోయి ఉండవచ్చు కానీ ఇవి మాత్రం పెట్టుకో అని బతిమలాడతాడు. తాను పెట్టుకోకపోయేసరికి యష్ వాటిని తీసి మాళవిక చెవులకి పెడతాడు. అది చూసి వేద మనసు ముక్కలవుతుంది. నేను నీతో గడిపిన జ్ఞాపకాలు చేదిరిపోయాయి కానీ సంతోషాలు కాదు ఆ సంతోషం ఆది నా లైఫ్ లో వాడి స్థానం వాడిదే, వాడిని క్షేమంగా సంతోషంగా మనం ఇద్దరం చూసుకోవాలని అంటాడు. బహుశా నేను లైఫ్ లో తండ్రిని కాలేను, నన్ను వేరే ఎవరు తండ్రిని చేయలేరు. ఈఈ జన్మకి నేను ఇద్దరి పిల్లల తండ్రినే అని యష్ మాళవికతో చెప్పి వెళ్ళిపోతాడు. యశోధర్ నోటితో వేద ఏ మాటలు అయితే వినకూడదు అనుకుందో ఆ మాటలే యశోధర్ నోటితో అనిపించావ్ శభాష్ అని అనుకుంటుంది.

వేద బాధగా ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటే యష్ అక్కడికి వస్తాడు. వేద మాటల ద్వారా మాళవికతో మాట్లాడిన విషయం విన్నట్లు అర్థం చేసుకుంటాడు. గతాన్ని అంత గట్టిగా గుర్తుంచుకున్న వాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని వేద అడుగుతుంది. నేను అన్నది వేరు, నువ్వు విన్నది వేరు అని యష్ సర్ది చెప్తాడు. కానీ వేద మాత్రం బాధగా మాట్లాడుతుంది. అమ్మ అయ్యే రాత దేవుడు నా నుదుటిన రాయలేదు, ఈ విషయం నేను ఎప్పుడు ఎవరి దగ్గర దాచలేదు. అందరి దగ్గర నేను విన్న మాట ఏదో తెలుసా గొడ్రాలు.. అని చాలా బాధపడుతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Vishnu Kanth: గుండెనిండా గుడిగంటలు బాలు.. ప్రేమ పెళ్లి 15 రోజుల్లోనే బ్రేకప్.. విష్ణుకాంత్ రియల్ లైఫ్ విషయాలు
గుండెనిండా గుడిగంటలు బాలు.. ప్రేమ పెళ్లి 15 రోజుల్లోనే బ్రేకప్.. విష్ణుకాంత్ రియల్ లైఫ్ విషయాలు
Gundenininda Gudigantalu Serial Today June 08: విద్యను నిలదీసిన మీనా, పార్లలమ్మ నిజస్వరూపం వీడియో తీసి ప్రభావతికి చూపించిన బాలు - గుండెనిండా గుడిగంటలు జూన్ 08 ఎపిసోడ్
విద్యను నిలదీసిన మీనా, పార్లలమ్మ నిజస్వరూపం వీడియో తీసి ప్రభావతికి చూపించిన బాలు - గుండెనిండా గుడిగంటలు జూన్ 08 ఎపిసోడ్
Nirupam Paritala: బుల్లితెర డాక్టర్ బాబు.. హిట్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్.. నిరుపమ్ రియల్ లైఫ్ విశేషాలు
బుల్లితెర డాక్టర్ బాబు.. హిట్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్.. నిరుపమ్ రియల్ లైఫ్ విశేషాలు
Triveni Yadav: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget