Devatha July 13th Update: ఆఫీసర్ సారె మీ నాయన అని దేవికి చెప్పనున్న రాధ - సత్య కంట మరో నిజం, అదిత్యపై అనుమానం
దేవిని ఎలాగైనా ఆ అదిత్యకి దూరం చేస్తాను. దేవికి ఎప్పటికీ నేనే నాన్న అని మాధవ క్రూరంగా ఆలోచిస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
సత్య, నువ్వు అమెరికా వెళ్తున్నారు కదా అక్కడ వ్యవసాయ పద్ధతులు బాగుంటాయంత కదా అవి తెలుసుకుని రా మన రుక్మిణికి నెరపిద్దామని అదిత్యకి చెప్తుంది. ఆ మాటలకి ఆదిత్య మౌనంగా ఉండటంతో రుక్మిణి రాదని నీకు అంత నమ్మకమా అని దేవుడమ్మ అంటుంది. అదేమీ లేదమ్మా రుక్మిణి వస్తుంది, బిడ్డ కూడా వస్తుంది నువ్వేమి దిగులు పడకు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కమల అదేంది మరిది అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావ్ అడుగుతుంది. అమ్మ ఆశ పడితే జరుగుతుంది కదా అందుకే అలా చెప్పానని చెప్తాడు. నువ్వు అంతగా కలవరిస్తున్న నీ కోడలు, నీ మనవరాలు నీ కళ్లెదుటే ఉన్నారని ఎలా చెప్పనమ్మా అని ఆదిత్య మనసులో బాధపడతాడు. దేవి ఎప్పటికీ నా బిడ్డే తన మీద అన్నీ హక్కులు నాకే ఉంటాయి అని మాధవ అన్న మాటలు గుర్తు చేసుకుని కంగారు పడుతుంది.
'పెనిమిటి మన బిడ్డ నీ దగ్గరే ఉంది ఆ ఆలోచనే నాకు మస్త్ ఖుషిని ఇస్తుంది. ఎప్పటికీ నీదగ్గరే ఉండాలి నీ బిడ్డ లెక్కనే నాయన అంటూ నీ ఏలు పట్టి తిరగాలి. కానీ గది జరగకుండా మాధవ సారు అడ్డుపడుతూనే ఉన్నారు. గా సారు నీకు బిడ్డకి అడ్డు రాకుండా ఉండాలంటే దేవమ్మకి నువ్వే నాయన అని తెలవాలి. మీ నాయన ఆఫీసర్ సారె అని చెప్పాలి. నేను చెప్పనంత వరకు గీ మాధవ సారు కథలు పడుతూనే ఉంటాడు. అందుకే బిడ్డకి నిజం చెప్పేస్తా. నిన్ను ఇద్దని ఒకటి చేస్తా ఇంక ఆలస్యం చేయను. రేపు బోనాలు అయ్యాక ఆ సంబరం అవ్వగానే దేవమ్మకి నిజం చెప్పేస్తా' అని రుక్మిణి నిర్ణయించుకుంటుంది.
ఇక దేవి ఒక్కటే కూర్చుని చెస్ ఆడుకుంటూ ఉండగా సత్య అక్కడికి వస్తుంది. ఇంటి దగ్గర మీ అమ్మ ఎలా ఉందని అడుగుతుంది. అందరం మంచిగా ఆడుకుంటాం, మేము ఏం చేసిన ఏమి అనరని అంటుంది. అప్పుడప్పుడు ఏదోలా ఉంటుంది ఎందుకు అలా ఉంటున్నవాని అడిగినా చెప్పదు అని దేవి అంటుంది. ఎందుకు అలా ఉంటుందని సత్య ఆలోచిస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఒక్కటే చెప్తుంది నువ్వు ఆ ఆఫీసర్ సార్ లెక్క మంచిగా చదువుకోవాలని చెప్తుంది. మా అమ్మ చాలా మంచిది. ఆఫీసర్ సారు నేను కలిసిన తీసుకున్న ఫోటో మా అమ్మ అద్దం గట్టించి ఇచ్చిందని చెప్పడంతో సత్య షాక్ అవుతుంది. ఆదిత్య ఫ్రేమ్ కట్టించి పెట్టుకుందంటే అక్క అదిత్యని మర్చిపోలేకపోతుందా, దేవి చెప్పింది వింటుంటే అదే అనిపిస్తుంది. ఆదిత్య కూడా దేవితో బొమ్మ గీయించుకున్న ఈషయం నాకెందుకు చెప్పలేదని ఆలోచిస్తుంది.
'దేవిని అదిత్యకి ఎంత దూరం చేయాలని చూస్తున్న అంత దగ్గర అవుతుంది. దూరం చేయాలని నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి రాధ అడ్డుపడుతుంది. నాకు దేవికి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇదే జరిగితే వెళ్లిపోయేది దేవి మాత్రమే కాదు నా రాధ కూడా అలా జరగడానికి వీల్లేదు. దేవి కోసం రాధ నా దగ్గరే ఉండాలి. ఈ నాన్నని కాదని అదిత్యకి ఎలా దగ్గరవుతుందో నేను చూస్తాను' అని రగిలిపోతాడు. ఇక దేవి ఆదిత్య పక్కన పడుకుని నిద్రపోతుంటే అది చూసి మురిసిపోతాడు. 'నువ్వు నా బిడ్డవి, కానీ నేను ఎంత ప్రేమ చూపించిన నన్ను పరాయివాడి ప్రేమే అనిపించడం నా దురదృష్టం. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా నా గుండెల మీద పడుకోవాల్సిన దానివి నువ్వు నా గుండెల మీదకి చేరడానికి పదేళ్ళు పట్టింది. నువ్వు నా బిడదవే అని తెలిసిన తర్వాత కూడా దగ్గరకి తీసుకోలేకపోతున్న' అని మనసులోనే బాధపడతాడు. దేవితో కలిసి నువ్వు బొమ్మ గీయించుకున్నవా అని అదిత్యని సత్య అడుగుతుంది. అవును అది చెప్పడం మర్చిపోయానని అంటాడు. ఏదో జరుగుతుందని సత్య ఆలోచనలో పడుతుంది. దేవుడమ్మ కుటుంబం బోనాల సంబరం చేసుకుంటుంది. ఇక దేవితో బోనం ఎత్తిస్తారు.