News
News
X

Ennenno Janmalabandham July 13th: కైలాష్ గురించి తెలుసుకున్న యష్ ఇక వాడికి చుక్కలే- వేదని పొగడ్తల్లో ముంచెత్తిన జడ్జ్, మాళవికకి చీవాట్లు

వేద, యష్ విడిపోయారని మాళవిక చెప్పడంతో ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ యష్ ఇంటికి వస్తుంది. ఆమెని చూసి యష్ షాక్ అవుతాడు. దీంతో నేటి కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ ని తీసుకుని మాళవిక యష్ ఇంటికి వస్తుంది. ఆమెని చూసి యష్ షాక్ అవుతాడు. మీ భార్య డాక్టర్ వేద కోసం వచ్చాను, ఎక్కడ ఉంది వేద అని జడ్జ్ అడుగుతుంది. మీ భార్యని పిలిపించండి నేను కేవలం తన కోసం మాత్రమే వచ్చానని చెప్తుంది. వేద ఇప్పుడే అని మాలిని ఏదో చెప్పబోతుంటే జడ్జ్ అడ్డుకుంటుంది. వేద ఇప్పుడే బయటకి వెళ్ళింది, బజారుకి వెళ్ళింది,  క్లినిక్ దగ్గరకి వెళ్ళిందని సాకులు మాత్రం చెప్పకండి నేను ఇప్పుడే వేద క్లినిక్ ని విజిట్ చేసి వస్తున్నా అని చెప్తుంది. వేద ఎక్కడకి వెళ్ళిందని జడ్జ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మీరు కోర్ట్ ను మోసం చేసి వేదని దొంగ పెళ్లి చేసుకున్నారు, ఖుషి కస్టడీ కోసం ఆడిన నాటకం, కన్న తల్లికి ద్రోహం చేశారు. ఇప్పుడు భార్య, భర్తలుగా కూడా కలిసి లేరు విడిపోయారు నిజం చెప్పు యశోధర మాళవిక కంప్లయింట్ ఇవ్వడం వల్లే నేను రావాల్సి వచ్చిందని జడ్జ్ యష్ ని నిలదిస్తుంది. అదేం లేదు మేడమ్ మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని యష్ అంటాడు. దానికి మాళవిక అదంతా డ్రామా వాళ్ళు మోసం చేశారని అంటుంది. వేద ఎక్కడ అని మాళవిక అడుగుతుంది. అప్పుడే వేద ఎంట్రీ ఇస్తుంది. 

Also Read: ఇరువురి భామల మధ్య ఈగో మాస్టర్ - వసుని నెట్టేసిన గర్వంలో సాక్షి, బుంగమూతి పెట్టిన వసుని రిషి బుజ్జగిస్తాడా!

ఇక వేద జడ్జ్ గారితో మాట్లాడుతుంది. నానమ్మ నానమ్మ అని ఖుషి మీ గురించి చెప్తుంది అని వేద అంటుంది. మీరు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని అంటుంది. ఇదంతా డ్రామా వేదని ఇంట్లో వాళ్ళు వెళ్లగొట్టారు, వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు అని జడ్జ్ కి చెప్తుంది. నేను వేద గురించి అడిగినప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని మాళవిక యష్ ని  ప్రశ్నిస్తుంది. ఆ మాటకి జడ్జ్ కూడా అవును నన్ను చూసి మీరందరూ షాక్ అయ్యారు ఎందుకు అని అడుగుతుంది. మీరు అనవసరంగా మా మీద అనుమానపడుతున్నారని వేద జడ్జ్ గారితో అంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళని అడగండి వీళ్ళ బండారం బయటపడుతుందని జడ్జ్ తో మాళవిక అంటుంది. ఆ మాటకి యష్, వేద కంగారు పడతారు. మా పరువు పోతుందని రత్నం అంటాడు. కానీ జడ్జ్ మాత్రం నా డ్యూటి నేను చేస్తాను మేరేమీ కంగారు పడకండి నేను బయట వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళు చెప్పే సమాధానాల బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను, మాళవిక చెప్పింది నిజమే అయితే ఖుషి కస్టడీ తనకి ఇచ్చేస్తాను ఎందుకంటే తాను కన్న తల్లి కదా అని చెప్తుంది. 

Also Read: యష్ ఇంటికి ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్, ఖుషి కస్టడీ మాళవికకేనా?

యష్ ఇంటి చుట్టుపక్కల ఇళ్ల నుంచి కొంతమంది ఆడవాళ్ళని పిలుచుకుని వస్తారు. వేద, యష్ మధ్య గొడవలు ఏమైనా పడ్డారా మీరేమైన చూశారా? అని వాళ్ళని జడ్జ్ అడుగుతుంది. వాళ్ళు గొడవ పడనిది ఎప్పుడు మేడమ్ ఎప్పుడు వీళ్ళు కీచులాడుకుంటూనే ఉంటారని చెప్తారు. ఆ మాటకి అక్కడి వారంతా షాక్ అవుతారు. ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారంటే వాళ్ళు భార్యాభర్తలు అవుతారు. వర్షం పడిన ఒక రోజు ఈ యశోధర్ వేదని గుండెలకి హత్తుకుని ఐ లవ్యూ కూడా చెప్పాడు. మరోసారి ఇక్కడ జరిగిన బారసాల ఫంక్షన్ లో వేద గురించి యష్ ఎంతో గొప్పగా చెప్పాడని వాళ్ళు చెప్తారు. వేద మంచి భార్యే కాదు మంచి తల్లి కూడా. వేద భార్య కావడం యశోదర్ అదృష్టం అని అంటారు. వేదని పొగడ్తలతో ముంచెత్తుతారు. నేను పిలవగానే వచ్చి కోపరేట్ చేసినందుకు థాంక్స్, మీరు చెప్పింది విన్న తర్వాత వేదకి ఖుషిని అప్పగించి మంచి పని చేశాను అని అంటుంది. ఇక జడ్జ్ కూడా వేదని మెచ్చుకుంటుంది. అప్పుడే అక్కడికి ఖుషి వస్తుంది. మీరు నన్ను మళ్ళీ మాళవిక అమ్మ దగ్గరకి పంపిస్తారేమో అని భయంగా ఉందని ఖుషి జడ్జ్ తో అంటుంది. అలా ఏమి చేయను నిన్ను చూసి పొడమని వచ్చానని జడ్జ్ చెప్తుంది. మీరు నన్ను మంచి అమ్మకి అప్పగించారని జడ్జ్ కి థాంక్యూ చెప్తుంది. ఇక జడ్జ్ మాళవికకి గడ్డి పెడుతుంది. మీ కూతురే మిమ్మల్ని చూసి భయపడుతుందని తిడుతుంది. మాళవిక వెళ్ళి జడ్జ్ ని కలిసి మాట్లాడిన విషయంగమనించానని వసంత్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఎలాగైన ఈ గండం నుంచి గట్టేక్కించాలని వేద వదినకి ఫోన్ చేసి చెప్పాను. సమయానికి వదిన వచ్చి మనల్ని కాపాడిందని చెప్తాడు. మాలిని వసంత్ ని మెచ్చుకుంటుంది చాలా మంచి పని చేశావని అంటారు. కానీ ఖుషిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేసింది వేద వదినె అంటాడు. 

తరువాయి భాగంలో.. 

యష్ కోపంగా కైలాష్ దగ్గరకి వచ్చి సారిక నీకు తెలుసా అంటే తెలుసు అని చెప్తాడు. ఇక వేద, యష్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. 

Published at : 13 Jul 2022 07:32 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Today Ennenno Janmalabandham Serial July 13th

సంబంధిత కథనాలు

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్