Vikrant Massey x Clive Kunder: ఎవరీ క్లైవ్ కుందర్? అహ్మదాబాద్ ఫ్లైట్‌లోని కో పైలట్ '12th ఫెయిల్' హీరో విక్రాంత్ బ్రదర్ / కజిక్ కాదు... మరి?
Who is Clive Kunder? క్లైవ్ కుందర్... అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తర్వాత ఎక్కువగా వినిపించిన పేర్లలో ఇదొకటి. బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే ఆయన గురించి పోస్ట్ చేశారు. దాంతో అతని కజిన్ అనుకున్నారంతా.

Ahmedabad Flight Crash News Today: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన తర్వాత ఎక్కువగా వినిపించిన పేర్లలో క్లైవ్ కుందర్ ఒకటి. ఆ ఫ్లైట్‌లోని ఇద్దరు పైలట్లలో క్లైవ్ ఒకరు. ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అయితే... ఆయన అసిస్టెంట్, ఫస్ట్ ఆపరేటింగ్ ఆఫీసర్ క్లైవ్ (కో పైలట్ అన్నమాట). బాలీవుడ్ నటుడు, '12th ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మాసే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వల్ల క్లైవ్ గురించి జనాలకు ఎక్కువ తెలిసింది.
మా అంకుల్ కొడుకు మరణించాడు!
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను, సన్నిహితులను తలచుకుంటుంటే తన గుండె బద్దలవుతోందని విక్రాంత్ మాసే పేర్కొన్నారు. అయితే... ఆ ఘటనలో తన అంకుల్ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడిని కోల్పోయారని, క్లైవ్ కుందర్ మరణం తమను మరింత బాధిస్తోందని విక్రాంత్ తెలిపారు.
విక్రాంత్ చేసిన పోస్ట్ చూసిన ఎవరికి అయినా సరే... క్లైవ్ అతడికి కజిన్ అవుతారని అనుకుంటారు. మీడియా కూడా అలానే భావించింది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనలో విక్రాంత్ కజిన్ / బ్రదర్ మరణించారని పేర్కొంది. ఆ తర్వాత '12th ఫెయిల్' హీరో అసలు విషయం చెప్పారు.
Also Read: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్... త్రివిక్రమ్ ప్లేస్‌లో ఆ హీరోకి డైరెక్షన్ ఛాన్స్!

క్లైవ్ నా బ్రదర్ కాదు... ఫ్యామిలీ ఫ్రెండ్!
''మీడియా మిత్రులకు, అందరికీ ఒక విన్నపం... దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదంలో మరణించిన క్లైవ్ నా బ్రదర్ కాదు. కుందర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్'' అని విక్రాంత్ మాసే స్పష్టత ఇచ్చారు. అదీ సంగతి.
Also Read: అలప్పూజా జింఖానా రివ్యూ: సోనీ లివ్ ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్
Clive Kunder (L), the first officer on the ill-fated Air India flight which crashed in Ahmedabad on June 12.
— Vani Mehrotra (@vani_mehrotra) June 13, 2025
Clive was the son of Clifford Kunder and a family friend of actor Vikrant Massey (R).#Ahmedabad #PlaneCrash #AirIndiaCrash https://t.co/kAVK9hFopY pic.twitter.com/nfuBijsjG4
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విమానంలోని వ్యక్తుల్లో ఒకరు మృత్యుంజయుడిగా బయట పడగా... మిగతా మనుషులంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. విమానం కూలిన హాస్పటల్ హాస్టల్ బిల్డింగ్‌లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా... మరణించిన వ్యక్తుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.





















