Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్... త్రివిక్రమ్ ప్లేస్‌లో ఆ హీరోకి డైరెక్షన్ ఛాన్స్!
Allu Arjun 23rd Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో మలయాళ దర్శకుడికి ఐకాన్ స్టార్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం

Icon Star Allu Arjun Next Movie?: ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఎవరితో!? 'పుష్ప 2 ది రూల్' విజయం తర్వాత మాటల మాంత్రికుడు, తనకు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తారని అందరూ భావించారు. అనూహ్యంగా తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఆ తర్వాత అయినా సరే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనుకుంటే... విక్టరీ వెంకటేష్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలు లైనులో పెట్టారు గురూజీ. మరి అట్లీ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఎవరితో? అంటే...
మలయాళ దర్శకుడితో మల్లు అర్జున్ మూవీ!
బసిల్ జోసెఫ్... మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే చాలా మందికి అతడు ఒక హీరోగా తెలుసు. 'జయ జయ జయ జయహే', 'సూక్ష్మ దర్శిని', 'పొన్‌మాన్' సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఓటీటీల్లో ఆకట్టుకున్నాయి. అయితే అతను హీరో మాత్రమే కాదు... డైరెక్టర్ కూడా!
టోవినో థామస్ హీరోగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన 'మిన్నల్ మురళి' సినిమా గుర్తు ఉందా? కరోనా సమయంలో ఎక్కువ మంది వీక్షకులు చూసిన సినిమా. భాషలకు అతీతంగా చాలా మందిని ఆకట్టుకున్న సినిమా. దానికి దర్శకత్వం వహించినది బసిల్ జోసెఫ్. అంతకు ముందు టోవినో థామస్ హీరోగా 'గోధ' సినిమా తీశారు. దానికి ముందు వినీత్ శ్రీనివాసన్ హీరోగా 'కుంజిరమయనం'తో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
Also Read: అలప్పూజా జింఖానా రివ్యూ: సోనీ లివ్ ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్
View this post on Instagram
Allu Arjun X Basil joseph Movie On Cards.. 🤯💥#AlluArjun #BasilJosephpic.twitter.com/mHuGWX0Z3G
— Let's X Cinematica (@letsXCinematica) June 12, 2025
Basil Joseph Screen Writing & Bunny Acting 🔥🥵
— N A V E E N _ A A ™ (@NAVEEN_AA_CULT) June 12, 2025
Peak movie 💥🔥🥵#AA23 @alluarjun @basiljoseph25 pic.twitter.com/UycUJe5LZA
ఇప్పటి వరకు మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన బసిల్ జోసెఫ్ (Basil Joseph) కు తనతో సినిమా చేసే అవకాశం అల్లు అర్జున్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలలో బలంగా వినబడుతోంది. అల్లు అర్జున్ హీరోగా బసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించబోయే సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం. అయితే దీని మీద అల్లు అర్జున్ సన్నిహిత వర్గాల నుంచి గాని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి గాని ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
Also Read: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో అక్కినేని పెద్ద కోడలు శోభిత చేతిలోని బ్యాగ్ రేటు ఎంతో తెలుసా?





















