War 2: భారం మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే... ప్రమోషన్స్ ఎక్కడ YRF? తెలుగులో ఎందుకిలా??
'వార్ 2' విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ కు పట్టున్న మాస్ జనాల్లోకి సినిమా సరిగ్గా వెళ్లలేదనేది డై హార్డ్ ఫ్యాన్స్ ఆవేదన. పబ్లిసిటీ స్ట్రాటజీ బాలేదంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (NTR) లాంటి సౌత్ సూపర్ స్టార్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా 'వార్ 2'. మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న సినిమా ఇది. అంతేనా ఈ ఇద్దరు హీరోలు చెరో 25 సంవత్సరాల కేరీర్ పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో వస్తున్న ల్యాండ్ మార్క్ మూవీ ఇది. ఇలాంటి సినిమాకు ఏ సాయి ప్రమోషన్స్ ఉండాలి? 'వార్ 2' నిర్మాణ సంస్థ YRF ఈ విషయంలో పూర్తిగా వెనకంజ లో ఉన్నట్టు కనపడుతోంది. ఈ సినిమాకి పోటీగా అదే రోజున (ఆగస్టు 14)న సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో అపజయం ఎరుగని దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న 'కూలీ' రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ కేరీర్ 50 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో ల్యాండ్ మార్క్ మూవీగా వస్తుండడం, కింగ్ నాగ్ తొలిసారి విలన్ పాత్రలో కనపడుతుండడంతో 'కూలీ' సినిమాపై స్పెషల్ బజ్ మొదటి నుండీ ఉంది. అనిరుద్ మ్యూజిక్ దీనికి అదనపు ఆకర్షణ. మరి ఇంతటి పోటీలో వస్తున్న 'వార్ 2' ప్రమోషన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయయా అంటే లేదనే చెప్పాలి. మరోవైపు 'కూలీ' సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. నార్త్ లో భారీ కటౌట్ల నుండిహైదరాబాదులో మెట్రో రైలు మొత్తం 'కూలి' పోస్టర్లతో నింపేశారు. ఇప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా స్పెషల్ ఇంటర్యూలలతో పాటు లేటెస్ట్ గా థియేటర్లలో 'కూలి' స్పెషల్ ట్రైలర్ ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఆ రేంజ్ లో'వార్ 2'ప్రమోషన్స్ ఉన్నాయా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం లేదనే పెదవి విరుస్తున్నారు.
ఒక్క ఈవెంట్ పెట్టి చేతులు దులుపుకున్న నిర్మాతలు?
జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఇది తగ్గట్టు మాత్రం ప్రమోషన్స్ జరగడం లేదనేది సగటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన. మొన్నటి హైదరాబాద్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ స్పీచ్ లు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అసలు సినిమా జోనర్ ఏంటి? ఈ సినిమాలో ఏం చూడబోతున్నాం? అనేది గ్రామాల్లో పల్లెల్లో నివసించే సామాన్యుల వరకు మాత్రం వెళ్ళలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, యూత్ మాత్రం చూస్తే వేల కోట్లు వచ్చేయవు కదా. మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు అసలైన పట్టు మాస్ లోనే. అందుకే 'వార్ 2' ప్రమోషన్స్ ని వారి వరకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంటే బాగుండేదనేది సినీ క్రిటిక్స్ మాట. 'కూలి' పూర్తి మాస్ మూవీ. కానీ 'వార్ 2' స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. దీనిని టైర్ 2 సిటీల్లో గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకుపోయేలాగా మరింతగా ప్రమోషన్స్ జరపాల్సి ఉంది. కానీ YRF తీరు చూస్తుంటే అలాంటిదేమీ కనిపించలేదు. సౌత్ ఇండియా మొత్తం భారం ఎన్టీఆర్ భుజాల పైనే ఉంచేసినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్ కి, ప్రాణాలిచ్చేలా ప్రేమించే అభిమానగణానికి తెలుగుతో సహా సౌత్ లో ఓపెనింగ్స్ భారీగా వచ్చేస్తాయి. కానీ వార్ 2 పై వైఆర్ఎఫ్ సంస్థ పెట్టుకున్న ఆశలు చాలా పెద్దవి. ఈ సినిమా రికార్డ్స్ కొల్లగొడితే భవిష్యత్తులో మరింత మంది సూపర్ స్టార్స్ ను YRF సహా ఇతర బాలీవుడ్ సంస్థలు నిర్మించే సినిమాల్లో భాగం చేయొచ్చు అనేది హిందీ పరిశ్రమ ఆశ. అయితే దానికి తగ్గట్టుగా వాళ్లు ప్రమోషన్ మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Also Read: ఎన్టీఆర్‌కు గుడి కట్టిన ఫ్యాన్స్... విజయవాడ శైలజా థియేటర్‌లో పూజలు
రాజమౌళి, సుకుమార్ లను ఆదర్శం గా తీసుకోవాలి
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా షూటింగ్ ఓపెనింగ్ టైం లోనే స్టోరీ లైన్ ఏమిటనేది చెప్పేస్తారు. అక్కడి నుంచి సినిమా విడుదలయ్యే లోపు ప్రేక్షకులను తన సినిమాలో ఏమి ఉంటుంది అనేదానిపై ఒక ఐడియా వచ్చేలా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే సుకుమార్ కూడా తను తీసిన పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ ను బీహార్ లో ప్లాన్ చేశారు. తమది మాస్ సినిమా కాబట్టి దాన్ని హిందీ లో ఎక్కడ ప్రమోట్ చేయాలో వారికి క్లియర్ గా ఐడియా ఉంది.దాని ప్రభావం సినిమా వసూళ్లు నిరూపించాయి కూడా. ఇంత బేసిక్ పాయింట్ ని YRF లాంటి పెద్ద సంస్థ మిస్ అయిందా అనే చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత గా తన హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రమోట్ చేసారు. ప్రస్తుతం మారిన జనరేషన్ వైఖరి ని, సినిమా ప్రమోటింగ్ ట్రెండ్ ను ఇది చూపిస్తోంది. మరి "వార్ 2 " లాంటి భారీ సినిమా తీసిన నిర్మాతలు సౌత్ లో ప్రమోషన్స్ బాధ్యతను పూర్తిగా ఎన్టీఆర్ భుజాలపైనే పెట్టేయడం ఏంటి అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?





















