Sundaram Master Trailer: 'సుందరం మాస్టర్' ట్రైలర్: ఇంగ్లీష్ విలేజ్‌లో వింత ప్రజలు - మగాడు నల్లగా ఉంటేనే ఇష్టమట!
Sundaram Master Trailer: అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది సుందరం మాస్టార్ సినిమా. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కామెడీ అండ్ సస్పెన్స్‌తో వినోదాత్మకంగా సాగింది ఈ ట్రైలర్.
Sundaram Master Trailer: ఈ మధ్యలో కాలంలో చిన్న సినిమాలకు ఆదరణ పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన కొన్ని చిన్న సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి కూడా. కంటెంట్ ఉంటే చాలా హీరో ఎవరైనా హిట్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు సిద్దంగా ఉంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎంతో మంది యంగ్ డైరెక్టర్, యాక్టర్స్ చిన్న సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు. అలా సరికొత్త కంటెంట్ వస్తున్నాడు కమెడియన్ వైవా హర్ష.
హర్ష ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ సుందరం మాస్టర్ మూవీ తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద (Divya Sripada) నటిస్తుంది. ఈ మూవీను సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హర్ష ఇంగ్లీష్ మాస్టార్‌గా ఫుల్ ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. ఇక మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ ఎలా ఉందంటే
ఈ సినిమా మొత్తం ఆదివాసిల, అక్కడి వారి జీవన శైలి నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కింది. ఆదివాసీలు అప్‌డేట్ అయితే ఎలా ఉంటారనే థీమ్‌తో ఎంటర్‌టైన్‌గా చూపించబోతున్నారని అర్థమైంది ఈ ట్రైలర్ చూస్తుంది. ఫుల్ ఫన్ అండ్ సస్పెన్స్‌తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకునే సీన్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ఈ ఊరోళ్లకి నల్లోళ్లంటే ఇష్టమని.. అందుకే మిమ్మల్ని ఇక్కడకు పంపారని చూపించడం.. ఊర్లో ఆడవాళ్లంతా హర్షపై ఆసక్తి చూపించడం.. ఇలా ట్రైలర్ మొత్తం వినోదాత్మకంగా సాగింది. ఇందులో ఒక సస్పెన్స్ కూడా చూపించారు. పురాతన కాలం నాటి పెట్ట కోసం హర్ష ఆ ఊరుకి వచ్చినట్టు తెలుస్తోంది. దాన్ని కనుక్కునే క్రమంలో అతడు ఎదుర్కొన్న పరిణామాల చూట్టూ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక మొత్తానికి ఈ సినిమా ఆడియన్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫుల్ నవ్వించేలా ఉంది.
ఇంగ్లీష్ మాస్టారుగా వైవా హర్ష
‘సుందరం మాస్టర్’ సినిమాలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద జంటగా కనిపించనున్నారు. ఈ మూవీలో హర్ష సుందరం అనే మాస్టార్ పాత్ర పోషిస్తున్నాడు. సినిమా అంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రకటించారు మేకర్స్. మూవీలో సుందరం మాస్టార్ గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ సబ్జెక్టు చెప్తుంటాడు. అయితే ఓ మారుమూల పల్లె లో ఉన్న స్కూల్ కు ఇంగ్లీష్ మాస్టారుగా వెళ్లాల్సి వస్తుంది. ఆ స్కూల్ లో అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. మరి సుందరం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించాడు అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనన్నారు మేకర్స్. ఇక మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
Read Also: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!