GAAMI Making Video: హాలీవుడ్ రేంజిలో ‘గామి‘ మేకింగ్, స్టన్నింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
Gaami Making Video: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ ఫాంటసీ మూవీ ‘గామి’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి స్టన్నింగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Vishwak Sen’s Gaami Making Video Released: టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ దర్శకత్వంలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ అదిరిపోయే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సెటప్ చూస్తుంటే మూవీ హాలీవుడ్ రేంజిలో ఉండబోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అంచనాలు పెంచుతున్న ‘గామి’ మేకింగ్ వీడియో
ఈ సినిమా షూటింగ్ హిమాలయాలతో పాటు వారణాసిలోనూ కొనసాగినట్లు తాజా వీడియోను బట్టి చూస్తే అర్థం అవుతోంది. సముద్ర మట్టానికి 19 వేల అడుగుల ఎత్తులో, గడ్డకట్టించే -40 డిగ్రీల చలిలో సినిమా షూటింగ్ కొనసాగించినట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. మరికొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు. ఇందులో కొన్ని అడ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. టీమ్ కష్టం చూస్తుంటే మెస్మరైజింగ్ అవుట్ ఫుట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
మార్చి 8న ‘గామి’ విడుదల
ఇక ఈ సినిమా చాలా ఏండ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. సుమారు 4 సంవత్సరాలుగా విశ్వక్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. అటు దర్శకుడు విద్యాధర్ ఏకంగా ఈ సినిమా మీద 8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారట. తాజాగా ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. మార్చి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్, చాందినీ చౌదరి డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ వాయిదా!
అటు విశ్వక్ సేన్ ‘గామి’తో పాటు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. గోదావరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈచిత్రంలో విశ్వక్ సేన్‌కి జోడీగా నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అంజలి మరో కీలక పాత్రలో మెరవబోతున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి `సుట్టంలా చూసి` అంటూ సాగే పాట విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. చివరకు మార్చి 8న విడుదల చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. కానీ, తాజాగా మళ్లీ ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Read Also: నెట్ ఫ్లిక్స్‌లో ‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్, అసంతృప్తిలో అభిమానులు!