Salaar on OTT: నెట్ ఫ్లిక్స్‌లో ‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్, అసంతృప్తిలో అభిమానులు!
Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘సలార్’. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయినప్పటికీ పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Salaar English Version Streaming On Netflix: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సలార్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రంతో పోటీపడింది. వసూళ్లలో షారుఖ్ చిత్రాన్ని వెనక్కి నెట్టి ‘సలార్’ దుమ్మురేపింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్ నటించిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ పరాజయాను చవిచూస్తున్న వేళ ‘సలార్’ ఆయనకు మాంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళంలో ప్రసారం అవుతోంది. ఇప్పుడు, ‘సలార్’ఇంగ్లీష్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నిరాశలో హిందీ అభిమానులు
‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల సందర్భంగా నెట్ ఫ్లిక్స్ కీలక విషయాన్ని వెల్లడించింది. “ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం” అని వెల్లడించింది. అయితే, నెట్ ఫ్లిక్స్ నిర్ణయం కొంత మంది సంతోషంగా ఉన్నా, మరికొంత మంది అభిమానులు నిరాశ చెందారు. ఈ మూవీ హిందీ వెర్షన్ ఇప్పటికీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సలార్’ OTT రిలీజ్ ను ప్రకటించినప్పుడు చాలా మంది అభిమానులు ఈ చిత్రం హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, త్వరలోనే హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
View this post on Instagram
‘సలార్’ మూవీ గురించి..
ప్రశాంత్ నీల్ ‘సలార్‘ సినిమాను మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్టు పాత్రలో కనిపించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. రవి బాస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషించారు. 'సలార్' పార్ట్ -1 ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ‘కల్కి 2898 ఏడీ‘ సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది. అటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Fighter Movie: ‘ఫైటర్’లో లిప్ లాక్ సీన్ - లీగల్ నోటీసులు పంపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్