Vinay Varma: 9 మంది అమ్మాయిలను అలా చేశానన్నారు, నిర్భయ కేసు కూడా పెట్టారు - మీడియాపై వినయ్ వర్మ ఫైర్
సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వినయ్ వర్మపై కొన్నాళ్ల క్రితం వేధింపుల ఆరోపణలు చేసింది ఓ అమ్మాయి. ఆ విషయంపై ఆయన తాజాగా స్పందించారు.
సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలామంది నటులపై మీ టూ ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై అయితే వేధింపుల విషయంలో సీరియస్ కేసులు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులుపై మాత్రమే కాదు.. స్టార్ హీరోలపై కూడా పలుమార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించి మెప్పించిన సీనియర్ నటుడు వినయ్ వర్మపై కూడా వేధింపుల కేసు పెట్టింది ఓ అమ్మాయి. నాలుగేళ్ల క్రితం ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చి వినయ్ వర్మపై వేధింపుల ఆరోపణలు చేయడం సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ విషయంపై వినయ్ వర్మ స్పందించారు. అప్పటి విషయాలను గుర్తుచేసుకొని బాధపడ్డారు.
తప్పు లేదు..
మీడియా అంతా ఒక్కటయిపోయి వినయ్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజాలే అన్నట్టుగా ప్రేక్షకులకు చూపించాయి. అదంతా ఎలా తట్టుకున్నారు అని వినయ్ వర్మను ప్రశ్నించగా.. తట్టుకోక తప్పదు, అదంతా కర్మ అనుకోవాలి అంటూ సమాధానమిచ్చారు. తప్పు చేయనప్పుడు అలా అనుకోవాలి కానీ తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలని అన్నారు. ‘‘తప్పు చేయలేదు కాబట్టే నేను ప్రతీ ఛానెల్‌లో వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడాను. కానీ అందులో మసాలా లేదని హైలెట్ చేయలేదు.’’ అంటూ తన తప్పు ఏమీ లేదని చెప్పుకొచ్చారు వినయ్ వర్మ.
బాధ్యతగల జర్నలిజం అంటే ఇదేనా..?
అసలు ఈ విషయం అంతా ఎలా మొదలయ్యింది అని వినయ్ వర్మ గుర్తుచేసుకున్నారు. తనను ఆరోపించిన అమ్మాయి దాదాపు 50 మీడియా ఛానెళ్లను పిలిచి ప్రెస్ మీట్ పెట్టిందని, అప్పుడు తనకు కొందరు ఫోన్ చేసి చెప్తేనే ఈ విషయం తెలిసిందని అన్నారు వినయ్. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన తర్వాత పలు ఛానెళ్లు.. ఈ వార్తను ప్రసారం చేయకుండా ఉండడానికి తనను డబ్బులు అడిగారంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదని అన్నారు. అసలు విషయమే తెలుసుకోకుండా చాలా ఛానెళ్లు ఇష్టం వచ్చినట్టు క్యాప్షన్స్ పెట్టి, దీనిని పబ్లిసిటీ చేశారని వాపోయారు. ఒక ఉర్దు పేపర్‌లో ‘వినయ్ వర్మ అనే డ్యాన్స్ టీచర్ పక్క రూమ్‌లోకి 9 మంది అమ్మాయిలను తీసుకెళ్లి నగ్నంగా చేశాడు’ అని రాశారు. ‘‘ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి’’ అని అసహనాన్ని వ్యక్తం చేశారు వినయ్ వర్మ. ఇది బాధ్యతగల జర్నలిజం కాదని ఖండించారు.
జీవిత రాజశేఖర్ ఒక్కరే..
వీఎన్ ఆదిత్యలాంటి వారు సైతం అసలు విషయం తెలుసుకోకుండా ఆయనపై వచ్చిన ఆరోపణలు నమ్మి టీవీ ఛానెళ్లకు ఇంటర్య్వూలు ఇచ్చారని వాపోయారు. ఇండస్ట్రీ తరపున జీవిత రాజశేఖర్ ఒక్కరే తనకు సపోర్ట్‌గా నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు. అందుకే తనను కూడా ఎక్కడా ఇంటర్వ్యూలో ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారని బయటపెట్టారు. తనను అసలు జైలులో పెట్టలేదని, ఆరోపణలు వచ్చినరోజే కోర్టుకు వెళ్లగా తనకు బెయిల్ దొరికిందని అన్నారు. ప్రస్తుతం ఆయనపై ఎలాంటి కేసు లేదని, ఆ అమ్మాయి వెనక్కి తీసుకుందని తెలిపారు. అంతా అయిపోయిన తర్వాత ఇదంతా ఎందుకు చేశావని అడగగా.. ఫీజు కోసం అని ఆ అమ్మాయి సమాధానం ఇచ్చిందని నవ్వుకున్నారు. ఆఖరికి తనపై నిర్భయ కేసు కూడా పెట్టారని వాపోయారు. ఈ కేసు వల్ల తనకు ఎలాంటి నష్టం జరగలేదని, అబద్ధపు ఆరోపణలు చేసినందుకు అమ్మాయికే నష్టం జరిగిందని అన్నారు వినయ్ వర్మ.
Also Read: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial