Vijay Sethupathi: విజయ్ సేతుపతి 'పుష్ప'లో విలన్ రోల్ రిజెక్ట్ చేశారా? Maharaja థాంక్యూ మీట్‌లో ఏం చెప్పారంటే?
Vijay Sethupathi on Pushpa Offer: విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజ' భారీ విజయం దిశగా దూసుకు వెళుతోంది. తెలుగులో హిట్ టాక్ వచ్చింది. ఈ థాంక్యూ మీట్‌లో 'పుష్ప 2' ఆఫర్ గురించి విజయ్ సేతుపతి మాట్లాడారు.
Did Vijay Sethupathi reject the villain role in Pushpa?: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. అందుకు కారణం... ఆయన ఓ తరహా పాత్రలకు పరిమితం కాని నటుడు. హీరోగా నటిస్తారు. విలన్ రోల్స్ కూడా చేస్తారు. కథలో కీలకమైన పాత్రల్లోనూ మెరుస్తారు. తెలుగులో 'ఉప్పెన', తమిళ 'విక్రమ్', రీసెంట్ హిందీ సినిమా 'జవాన్'లో ఆయన విలన్ రోల్స్ చేశారు. అయితే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియన్ హిట్ 'పుష్ప' మూవీలో విలన్ క్యారెక్టర్ ఆయన రిజెక్ట్ చేశారని ప్రచారం జరిగింది. దానిపై ఆయన తాజాగా స్పందించారు.
నేను రిజెక్ట్ చేయలేదు కానీ...
అన్నిసార్లూ నిజం చెప్పకూడదు!
విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజ'. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ లభించింది. దాంతో సోమవారం హైదరాబాద్ సీటీలో థాంక్యూ మీట్ (Maharaja movie thank you meet) నిర్వహించింది చిత్ర బృందం. అందులో విజయ్ సేతుపతికి 'పుష్ప 2' గురించి ప్రశ్న ఎదురైంది.
'మీరు 'పుష్ప'లో రోల్ రిజెక్ట్ చేశారని టాక్ అయితే నడిచింది. నిజమేనా?' అని విజయ్ సేతుపతిని టాలీవుడ్ రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ''నేను రిజెక్ట్ చేయలేదు సార్! కానీ, అన్ని ప్రదేశాల్లో అన్నిసార్లూ నిజం చెప్పకూడదు. అది జీవితానికి బాగోదు సార్! కొన్నిసార్లు అబద్ధం చెప్పడం మంచిది సార్'' అని విజయ్ సేతుపతి సమాధానం ఇచ్చారు. దాంతో ఆయనకు 'పుష్ప'లో అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని, కానీ చేయలేదని ఇప్పుడు అబద్ధం చెప్పారని ప్రేక్షకులు అనుకోవాల్సి వస్తోంది.
Also Read: మీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!
#Pushpa లో Role Reject చేసారా ?
— Daily Culture (@DailyCultureYT) June 17, 2024
"నేను Reject చేయలేదు...అన్ని చోట్లా నిజాలు చెప్పకూడదు" - #VijaySethupathi#Pushpa2TheRule pic.twitter.com/wdVhA7EEyh
'మహారాజ' విజయం గురించి విజయ్ సేతుపతి ఏమన్నారంటే?
ఇక, 'మహారాజ' థాంక్ యూ మీట్‌లో ఆ సినిమా విజయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ... ''తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ఆ ప్రేమ చూసి కొంచెం భయం వచ్చింది. 'మహారాజ' తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నా. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు ఎక్కడ కలిసినా '96', 'మాస్టర్', 'విక్రమ్', 'ఉప్పెన' సినిమాలు ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు థాంక్స్. ఇక్కడకు విచ్చేసిన దర్శకులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే ఆనందంగా వుంది. బుచ్చి (బుచ్చిబాబు సానా) నాకు తమ్ముడు లాంటి వాడు. 'ఉప్పెన' లాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ థాంక్ యూ మీట్‌కి అతను రావడం నాకు సర్ ప్రైజింగ్'' అని చెప్పారు.
Also Read: హైదరాబాద్ రేప్ కేసుపై బాలీవుడ్ సినిమా - కరీనా, ఆయుష్మాన్ జంటగా!