అన్వేషించండి

India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?

Andhra Pradesh: ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నేతృత్వం వహించడాన్ని విజయసాయిరెడ్డి స్వాగతిస్తున్నారు.

Is YCP getting ready to join India alliance:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదో ఓ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిగి మమతా బెనర్జీ నాయకత్వంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను సిద్దమేనని మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా పలు పార్టీలు మద్దతు పలికాయి.  ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు దీదీ నాయకత్వానికి ఓకే అంటే సరే అనుకోవచ్చు కానీ జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా మద్దతు పలికడం రాబోతున్న మార్పులకు సూచనగా మారింది. 

ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం           

ప్రస్తుతం ఇండియా కూటమి చీలిక దిశగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. హర్యనా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆప్ .. కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీల నేతలే కూటమికి నేతృత్వం వహించాలని కోరుకుంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి వారు ఈ డిమాండ్ ను సమర్థిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా ఓకే అంటే.. నాయకత్వం మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై కూటమిని నిర్మించే బాధ్యత ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే అవకాశాలనుపరిశీలించే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. 

వైసీపీ వంటి కొత్త పార్టీలు చేరే అవకాశం                    

విజయసాయిరెడ్డి ఇండియా కూటమికి దీదీ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ప్రకటించేశారు. మామూలుగా అయితే ఆ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తే మాకేంటి అంటారు కానీ ఆయన తీరు మాత్రం వేరుగా ఉంది. ప్రస్తుతం వైసీపీ అత్యంత బలహీనంగా ఉంది.  అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని ఎదుర్కోవాలంటే తమకు ఓ కూటమి మద్దతు ఉండాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరడానికి ఇంత కాలం సంశయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ మినహా మిగతా ఇండియా కూటమి పార్టీలన్నీ హాజరయ్యాయి. ఇప్పుడు ఆ వ్యూహం వెనుక ఉన్న రాజకీయం వెలుగులోకి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇండియా కూటమి పునరేకీకరణ జరుగుతుందా ?     

మమతా బెనర్జీ నేతృత్వంలో త్వరలో ఇండియా కూటమి పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో కానీ.. వైసీపీ చేరడం మాత్రం పక్కా అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మమతా బెనర్జీ కూడా నేరుగా జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఇంత కాలం బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని జగన్ ఇప్పుడు ఆ పార్టీని నమ్మడానికి సిద్దంగా లేరు. అందుకే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారన్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget