Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి... ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!
Meenakshi Chaudhary as Young Hero Wife: యంగ్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి ప్రయోగాలు చేయడానికి అసలు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొత్త సినిమాలో యంగ్ హీరో వైఫ్ రోల్ చేశారామె.
Meenakshi Chaudhary Upcoming Movies: యంగ్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి నటించిన సినిమాల సంఖ్య తక్కువే. ఆరేడు సినిమాల్లో కనిపించారు. ఆ మాటకు వస్తే... తెలుగులో ఆవిడ కథానాయికగా నటించిన సినిమాలు మూడు అంటే మూడు అంతే! సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు', అడివి శేష్ 'హిట్: ది సెకండ్ కేస్', మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ'. సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలిగా 'గుంటూరు కారం'లో కనిపించినా... నిడివి తక్కువ కనుక మెయిన్ హీరోయిన్ అని అనలేం. నాలుగైదు సినిమాలకు ఆవిడ ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారు. కొత్త సినిమాలో వైఫ్ రోల్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
'లక్కీ భాస్కర్'లో దుల్కర్ సల్మాన్ భార్యగా!
Meenakshi Chaudhary Role In Lucky Bhaskar: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ స్ట్రయిట్ తెలుగు సినిమా 'లక్కీ భాస్కర్'. దీనికి వెంకీ అట్లూరి రచయిత, దర్శకుడు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి కథానాయిక. ఆవిడ దుల్కర్ సల్మాన్ భార్య పాత్రలో కనిపించనున్నారు.
'లక్కీ భాస్కర్' సినిమాలో భాస్కర్ సతీమణి సుమతి పాత్రలో మీనాక్షీ చౌదరి సందడి చేయనున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు తనకు ఎంతో ఇష్టమైన క్యారెక్టర్ ఇదని ఆవిడ తెలిపారు. ఇది మీనాక్షి బెస్ట్ క్యారెక్టర్ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్ రేప్ కేసుపై బాలీవుడ్ సినిమా - కరీనా, ఆయుష్మాన్ జంటగా!
View this post on Instagram
Srimathi Garu Song Promo From Lucky Baskhar Movie: 'లక్కీ భాస్కర్' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో 'శ్రీమతి గారు'ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సాంగ్ టైటిల్ వింటేనే హీరోయిన్ రోల్ ఏమిటనేది అర్థం అవుతుంది. ఆ లిరిక్స్ విన్నాక ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
''కోపాలు చాలండీ శ్రీమతి గారు...
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు...''
అంటూ సాగిన సాంగ్ ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాంచి మెలోడియస్ బాణీ అందించగా... విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. ఫుల్ సాంగ్ ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read: మిస్టర్ బచ్చన్ రాంపేజ్... హరీష్ శంకర్ మార్క్ మాస్ మహారాజా యాక్షన్ షురూ
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో 'లక్కీ భాస్కర్' సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Lucky Bhaskar Release Date: 'లక్కీ భాస్కర్' సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆ మధ్య వెల్లడించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' ఆ తేదీకి వస్తున్నట్లు ఆ తర్వాత తెలిసింది. దాంతో 'లక్కీ భాస్కర్' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ అంటే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి, ఆయన బాబాయ్ & హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర రాధాకృష్ణ)కు అభిమానం. ఆయనతో 'అరవింద సమేత వీరరాఘవ' ప్రొడ్యూస్ చేశారు. అందువల్ల, ఎన్టీఆర్ సినిమాకు పోటీగా 'లక్కీ భాస్కర్' రాకపోవచ్చు.