War 2 : హృతిక్, ఎన్టీఆర్ పై అదిరిపోయే మాస్ సాంగ్ - రంగంలోకి ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్లు?
NTR War Movie Update: 'వార్ 2' సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ పై ఓ మాస్ సాంగ్ ని ప్లాన్ చేశారట మేకర్స్. ఇందుకోసం ఇద్దరు కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నట్లు తాజా సమాచారం.
Latest Update On War 2 Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రెస్టేజ్ మూవీ 'వార్ 2' కోసం తాజాగా ముంబై వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పుడో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్ని రోజులు 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఎట్టకేలకు 'వార్ 2' సెట్స్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే తారక్ ముంబైలో ల్యాండ్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో మాస్ సాంగ్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు నెంబర్ వన్ డాన్సర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో 'వార్ 2' సినిమాలో ఓ క్రేజీ డాన్స్ నెంబర్ ని ప్లాన్ చేశారట మేకర్స్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతుందట. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎంతో స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ సాంగ్ షూటింగ్ త్వరలోనే జరగనున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. హృతిక్, తారక్ ఇద్దరు స్టైలిష్ మాస్ డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసేందుకు ఇండియన్ బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దించబోతున్నారట.
హృతిక్, ఎన్టీఆర్ కాంబో సాంగ్ కోసం ఇద్దరు కొరియోగ్రాఫర్లు
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే 'RRR' మూవీలో 'నాటు నాటు' పాటకి తమ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'నాటు నాటు' సాంగ్ లోని హుక్ స్టెప్స్ తో ఈ ఇద్దరూ వరల్డ్ క్లాస్ ఆడియన్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేశారో ఇప్పుడు 'వార్ 2' లోనూ హృతిక్, తారక్ నుంచి అలాంటి పర్ఫామెన్స్ ని రాబట్టేందుకు ఏకంగా ఇద్దరు కొరియోగ్రాఫర్లను రంగంలోకి దించారట మేకర్స్. లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి గణేష్ మాస్టర్, టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కొన్ని హుక్ స్టెప్స్ ని డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో సుమారు పది రోజుల పాటు ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ జరగనున్నట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.
రెండు వారాల పాటూ నాన్ స్టాప్ వర్కౌట్స్
'వార్ 2' మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ఎక్స్ పర్ట్ తో సుమారు రెండు వారాల పాటు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొనబోతున్నాడట. హృతిక్ రోషన్ కి ధీటుగా కనిపించేలా నాన్ స్టాప్ వర్కౌట్ చేస్తూ భారీగా కండలు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ ఓ సీక్రెట్ స్పై గా కనిపిస్తారట. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14 గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు.
Also Read : రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు - ఎందుకో తెలుసా?