అన్వేషించండి

Pawan Kalyan : రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు - ఎందుకో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చరణ్ కి డాక్టరేట్ రావడం పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన అభినందనలు తెలియజేశారు.

Pawan Kalyan Best Wishes To Ram Charan Getting Doctorate : టాలీవుడ్ అగ్ర హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి తాజాగా అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నాడు. చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ తాజాగా రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈ నెల 13న వేల్స్ యూనివర్సిటీలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ డాక్టరేట్ ని అందుకోబోతున్నాడు. ఇక ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా చరణ్‌కు డాక్టరేట్ రావడంపై బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అభినందనలు తెలియజేశారు.

చరణ్ కి డాక్టరేట్.. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

"చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ కి డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీ రామ్ చరణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముతావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని.. మరిన్ని పురస్కారాలు.. మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ తాజా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

Pawan Kalyan : రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు - ఎందుకో తెలుసా?

చరణ్ కంటే ముందే పవన్‌కు..

రామ్ చరణ్ కంటే ముందు కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌కు ఇదే వేల్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ దానిని సున్నితంగా తిరస్కరించారు. సినీ పరిశ్రమలో నాకన్నా బాగా రాణించినవారు చాలామంది ఉన్నారని, వారికి ఈ గౌరవం అందజేయండి అంటూ ఆ డాక్టరేట్ ని రిజెక్ట్ చేశారు  అప్పుడు బాబాయి రిజెక్ట్ చేసిన డాక్టరేట్ ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ కి రావడం విశేషం.

'గేమ్ ఛేంజర్' ఎక్కడి వరకు వచ్చింది?

రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదలై రెండేళ్లవుతోంది. ఇంకా రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా 15 రోజుల నుంచి 20 రోజుల షూటింగ్ వర్క్ మిగిలిందట. షూటింగ్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : నటుడు షాయాజీ షిండేకు తీవ్ర అస్వస్థత - ఏమైందంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget