‘కన్నప్ప’లో శివరాజ్ కుమార్, ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు అదే - వారానికి మూడు సార్లు బిర్యానీ తింటా : రానా దగ్గుబాటి
టాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దగ్గుబాటి రానా. హీరో గానే కాకుండా 'బాహుబలి' సినిమాతో విలన్ గాను మెప్పించాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్య నిర్మాతగా కూడా మారి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రానా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలయ్యతో 'భగవంత్ కేసరి' టీమ్ అన్‌స్టాపబుల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విజయ దశమికి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలోకి సినిమా రావడానికి ముందు... ఆ చిత్ర బృందంతో ఆయన డిజిటల్ స్క్రీన్ మీద బాలకృష్ణ సందడి చేయనున్నారు. ఆహా ఓటీటీలో వినోదం పంచబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్ - సినిమా రేంజ్ పెంచేస్తున్న విష్ణు మంచు!
యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో రూపొందుతున్న మైథాలజీ మూవీ 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. విష్ణుతో పాటు వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో నటించనున్నారు. శివ పార్వతులుగా వాళ్ళు కనిపించనున్నారు. అయితే... విష్ణు నోటి నుంచి ఆ మాట రాలేదు. ప్రభాస్ నటిస్తున్న విషయం మాత్రమే చెప్పారు. వాళ్ళిద్దరికీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనను విష్ణు కలిశారు. ఆ ఫోటో రిలీజ్ చేశారు. వీళ్ళకు తోడు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కూడా నటించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వైరల్ అవుతున్న మహేష్ బాబు న్యూ లుక్.. టాలీవుడ్ జేమ్స్ బాండ్ అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇంకా కుర్రాడిలా అదే అందం, అదే ఫిజిక్‌ని మైంటైన్ చేస్తున్నాడు. ఇక ఈమధ్య జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన వర్కౌట్స్‌కు సంబంధించిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న మహేష్.. తాజాగా మరోసారి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన పిక్చర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో మహేష్ ఓ రేంజ్లో కండలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ బాండ్లాగా తన బాడీని బిల్డ్ చేసుకునేందుకు మహేష్ జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'స్కంద' - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన 'స్కంద'(Skanda) మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. రామ్ పోతినేని - బోయపాటి కాంబినేషన్లో మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు రామ్ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. విడుదలకు ముందు టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదల రోజు భారీ ఓపెనింగ్స్‌ని అందుకుంది. రామ్ కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ 'స్కంద' మూవీకి రావడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)