అన్వేషించండి

వైరల్ అవుతున్న మహేష్ బాబు న్యూ లుక్.. టాలీవుడ్ జేమ్స్ బాండ్​ అంటున్న ఫ్యాన్స్

మహేష్ బాబు జిమ్ వర్కవుట్​కు సంబంధించిన న్యూ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మహేష్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తూ కనిపించారు.

టాలీవుడ్​లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇంకా కుర్రాడిలా అదే అందం, అదే ఫిజిక్​ని మైంటైన్ చేస్తున్నాడు. ఇక ఈమధ్య జిమ్​లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన వర్కౌట్స్​కు సంబంధించిన పిక్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్​ని ఖుషీ చేస్తున్న మహేష్.. తాజాగా మరోసారి జిమ్​లో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన పిక్చర్​ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్​లో మహేష్ ఓ రేంజ్​లో కండలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ బాండ్​లాగా తన బాడీని బిల్డ్ చేసుకునేందుకు మహేష్ జిమ్​లో భారీ కసరత్తులు చేస్తున్నాడు.

తాజాగా షేర్ చేసిన పిక్​లో మహేష్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తూ కనిపించారు. ఆ పిక్​లో మహేష్ బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. ఈ పిక్​ని షేర్ చేస్తూ.. "హార్డ్ వర్క్ విషయానికి వస్తే నలుపు తెలుపు అంటూ ఏమీ ఉందడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే"అంటూ  రాసుకొచ్చాడు. హాలీవుడ్​కు చెందిన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హీత్ మాథ్యూస్​ను మహేష్ తన ఫిట్నెస్ ట్రైనర్​గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అతని ఆధ్వర్యంలోనే మహేష్ వర్కౌట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం మహేష్ న్యూ  పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు మహేష్​ని 'జేమ్స్ బాండ్' అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

మరి కొంతమంది 'రాజమౌళి సినిమా కోసమే మహేష్ అన్న భారీగా కండలు పెంచుతున్నాడని, జక్కన్న మహేష్​ని జేమ్స్ బాండ్​లా చూపించబోతున్నడంటూ' చెబుతున్నారు. ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాలోనూ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించలేదు. గతంలో సుకుమార్ తెరకెక్కించిన 'వన్ నేనొక్కడినే' మూవీ సమయంలో మహేష్ సిక్స్ ప్యాక్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ సమయంలో తన ముఖంలో తెలియని మార్పులు రావడంతో మధ్యలోనే ఆపేసాడు. కానీ ఈసారి రాజమౌళి సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ ట్రైనర్ నియమించుకొని మరి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేష్ జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లన్నారు మహేష్. తాజాగా మహేష్ సినిమాకు సంబంధించి రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేశారు. నవంబర్ లో ఈ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'స్కంద' - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget