అన్వేషించండి

Rana Daggubati: పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు అదే - వారానికి మూడు సార్లు బిర్యానీ తింటా : రానా దగ్గుబాటి

దగ్గుపాటి హీరో రానా తాజాగా చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనగా ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

టాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దగ్గుబాటి రానా. హీరో గానే కాకుండా 'బాహుబలి' సినిమాతో విలన్ గాను మెప్పించాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్య నిర్మాతగా కూడా మారి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రానా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి చెప్పారు.

దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,  కేరళ, తమిళనాడు, తెలంగాణ అభివృద్ధి గుర్తించి... దక్షిణ భారతదేశంలోని  దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకు శతాబ్దానికి పైగా ఘన చరిత ఉన్న ABP నెట్ వర్క్ ఇవాళ చెన్నైలో ABP Southern Rising Summit 2023 నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రానా పెళ్లి ప్రస్తావన రావడంతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మీ భార్యతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఓవైపు యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఇన్వెస్టర్ గా ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం.. వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు? అని అడిగితే..

పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఇదే

"నాతో పాటు నా భార్య కూడా ఓ ఆర్టిస్ట్. తను కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మేమిద్దరం కలిసి పనిచేస్తాం. నిజానికి అది నా జాబ్ కాదు. కానీ అది లైఫ్ స్టైల్ లో భాగం. నా భార్య ఆ లైఫ్ స్టైల్ ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది. దానికోసం మా ఇద్దరికీ సరిపడా సమయం దొరుకుతుంది. ఆ లైఫ్ స్టైల్ నన్ను ఓ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్ గా మార్చింది ఈ లైఫ్ స్టైల్ కి నేను అలవాటు పడకపోయి ఉంటే నిలకడగా లేకుండా దేశం మొత్తం తిరిగి వచ్చేవాడిని. పెళ్లి తర్వాత నా లైఫ్ లో జరిగిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, బాధ్యతలు తెలిసి రావడం. పెళ్లి తర్వాత మనం చేయాల్సిన పనులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అదే పెళ్లికి ముందు మనం ఏం చేయాలనేది మనకు తెలియదు. మనకు ఎవరు చెప్పరు. ఏదో తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పెళ్లి తర్వాత అలా కాదు. మనం ఎప్పుడు ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది. బాధ్యతలు తెలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయ్యాను" అంటూ చెప్పారు.  

వారానికి మూడు సార్లు బిర్యానీ తింటా

ఇదే కార్యక్రమంలో దగ్గుబాటి రానా ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.." నా లైఫ్ లో చూసుకుంటే నేను మొదటి నుంచి పెద్దగా ఫిట్ గా లేను. సినిమాలే నన్ను ఇంత ఫిట్ గా ఉండేలా చేశాయి. షూటింగ్స్ లేని సమయంలో నేను ఫిట్నెస్ పై పెద్దగా శ్రద్ధ తీసుకోను. బాహుబలి లాంటి సినిమాలు చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకోవాలి. కావలసిన దాని కంటే ఎక్కువగా బాడీ పెంచాలి. దాన్ని కొన్ని సంవత్సరాలు అలాగే మెయింటైన్ చేయాలి. సో నేను ఫిట్నెస్ పై సలహాలు ఇవ్వడానికి పర్ఫెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఫిట్నెస్ విషయంలో నేను పెద్దగా డైట్స్ కానీ, జాగ్రత్తలు ఏమి ఫాలో అవ్వను. కొన్ని కొన్ని సార్లు అన్ హెల్తీ ఫుడ్ కూడా తింటూ ఉంటాను. మీరు హైదరాబాద్ బిర్యాని తింటారా? అని అడిగితే, కచ్చితంగా తింటాను. ఎందుకంటే నేను హైదరాబాదిని కాబట్టి. ఒక్కసారి కాదు వారంలో మూడుసార్లు బిర్యాని తింటాను" అంటూ చెప్పుకొచ్చాడు రానా దగ్గుబాటి. 

Also Read : బ్రిటీషర్ల నుంచి ఇప్పటికి రాజకీయం ఏం మారింది? సోషల్ మీడియా వినోదమే! - రానా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget