అన్వేషించండి

Tinnu Anand: బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య అదే పోలిక - ‘సలార్’ ఫేమ్ టిన్ను ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Tinnu Anand: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’లో కీలక పాత్ర పోషించిన టిన్ను ఆనంద్.. బాలీవుడ్, సౌత్ సినిమాలను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tinnu Anand: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ చాలాకాలం తర్వాత ఫ్యాన్స్‌కు సంతోషాన్నిచ్చింది. ఇక ప్రభాస్‌కు కూడా కావాల్సిన హిట్‌ను అందించింది. ఈ మూవీలో ప్రభాస్‌కు ప్రాణస్నేహితుడి పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. ఇక ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, శ్రియా రెడ్డి వంటి నటీనటులు వారు కనిపించారు. ‘సలార్’లో కీలక పాత్రలు పోషించిన వారిలో సీనియర్ నటుడు టిన్ను ఆనంద్ కూడా ఒకరు. తాజాగా ఈ సీనియర్ ఆర్టిస్ట్.. ఫిల్మ్ మేకింగ్ విషయంలో సౌత్‌కు, బాలీవుడ్‌కు ఉన్న తేడాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్పెషల్ టీజర్..

‘సలార్’ నుండి ఎన్నో అప్డేట్స్ వచ్చినా.. ముందుగా విడుదలయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ గ్లింప్స్ మొత్తం టిన్ను ఆనంద్ డైలాగులతోనే నిండిపోయింది. పెద్ద డైలాగ్‌తో ‘సలార్’లోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి వివరించారు టిన్ను ఆనంద్. అయితే ఆ టీజర్ చూసిన తర్వాత ‘సలార్’ టీమ్ రియాక్షన్ ఏంటి తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో టిన్ను ఆనంద్ బయటపెట్టారు. మొదటిసారి క్యాస్ట్ అండ్ క్రూ కలిసి ‘సలార్’ టీజర్‌ను చూశారని గుర్తుచేసుకున్నారు. ప్రశాంత్ నీల్, ప్రశాంత్ నీల్ భార్య, ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి ఈ టీజర్ చూశారని తెలిపారు. టీజర్‌లో తన పర్ఫార్మెన్స్‌ను ప్రభాస్ ప్రశంసించారని అన్నారు. ఇక ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ టీజర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

బాలీవుడ్‌లో అలాంటిది దక్కదనుకున్నా..

‘సలార్’ వల్ల తనకు సౌత్ ప్రేక్షకుల నుండి ఆదరణ లభిస్తుందని టిన్ను ఆనంద్ బయటపెట్టారు. సౌత్ నుండి వచ్చే ప్రేమ, ఆదరణ గొప్పదని, అలాంటివి బాలీవుడ్‌లో దక్కదని తను అనుకుంటూ ఉండేవాడిని అని తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్, సౌత్‌ను పోలుస్తూ టిన్ను ఆనంద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించే టిన్ను ఆనంద్.. ప్రభాస్‌తో కలిసి ‘సాహో’లో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ‘సలార్’తో రెండోసారి ప్రభాస్‌తో కలిసి నటించారు. చాలాకాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అంజి’లో విలన్‌గా తాను పోషించిన పాత్రతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు టిన్ను ఆనంద్. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు.. తనను ఆ పాత్రతోనే గుర్తుపెట్టుకున్నారు.

పార్ట్ 2 కోసం వెయిటింగ్..

‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పార్మ్ నెట్‌ఫ్లిక్స్.. ‘సలార్’ ఓటీటీ హక్కులను భారీ ప్రైజ్‌తో దక్కించుకుంది. హోంబేల్ ఫిల్మ్స్.. ‘సలార్’ మూవీని నిర్మించింది. ప్రశాంత్ నీల్ మునుపటి చిత్రాలు ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్‌ను కూడా హెంబేల్ ఫిల్మ్స్ సంస్థే నిర్మించింది. ‘సలార్ పార్ట్ 1’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. రెండేళ్లలోనే ‘సలార్ పార్ట్ 2’ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభిస్తామని ప్రశాంత్ నీల్ ఇప్పటికే రివీల్ చేశాడు.

Also Read: 18 ఏళ్లకే ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్, ఇప్పటికీ గంజి అన్నం తింటాం - హేమ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Advertisement

వీడియోలు

ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
5 seater Cheapest car: 5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
Embed widget