అన్వేషించండి

Devara Second Single: ‘దేవర’ పాటకు ముహూర్తం ఫిక్స్ - టైమ్ కూడా చెప్పేసిన మేకర్స్

Devara Second Single: కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ నుండి పాటల సందడి మొదలయ్యింది. ఇందులో నుండి రెండో పాట ఎప్పుడు, ఏ సమయానికి విడుదల అవుతుందో కూడా మేకర్స్ ప్రకటించారు.

Devara Second Single Release Date: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అంతా తనను మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పూర్తిగా ‘దేవర’పైనే ఫోకస్ పెట్టాడు తారక్. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవ్వడం లేదు. అందుకే ముందు అనుకున్న విడుదల తేదీకంటే ఏకంగా 8 నెలలు పోస్ట్‌పోన్ అయ్యింది. అనుకోకుండా ఆ గడువును తగ్గిస్తూ మరో నెల ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. వారిని మరింత హ్యాపీ చేయడం కోసం ‘దేవర’లోని సెకండ్ సింగిల్‌ రిలీజ్ టైమ్‌ను తాజాగా రివీల్ చేశారు.

రెండో పాట..

ఇప్పటికే కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ నుండి ఫియర్ సాంగ్ విడుదలయ్యింది. వింటుంటే ఇదొక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని అర్థమవుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు ఏ రేంజ్‌లో సంగీతం అందించాడో ఫియర్ సాంగ్‌తోనే ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఇక మాస్ బీట్స్ చాలు అని, ఒక మంచి రొమాంటిక్ సాంగ్‌కు టైమ్ అయ్యింది అంటూ ‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. ముందుగా ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ ఉన్న ఒక రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరిలో హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ విడుదల సమయాన్ని బయటపెట్టారు.

క్యూట్ పెయిర్..

ఆగస్ట్ 5 సాయంత్రం 5.04 నిమిషాలకు ‘దేవర’ నుండి రెండో పాట విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అని అనౌన్స్ చేసినప్పటి నుండి ఎన్‌టీఆర్, జాన్వీ పెయిర్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. కానీ సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత వారు ఊహించిన దానికంటే ఈ కపుల్ చాలా క్యూట్ ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వారి అంచనాలను మరింత పెంచేలా ఈ పాట ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ‘టైమ్ లాక్ అయ్యింది. ఇక మీరు కూడా లాక్ అయిపోతారు’ అంటూ ప్రకటించారు.

View this post on Instagram
 
A post shared by Devara Movie (@devaramovie)

నెల ముందే..

ముందుగా 2024 సమ్మర్‌లోనే ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ పలు కారణాల వల్ల సినిమా పోస్ట్‌పోన్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ తర్వాత ఏకంగా అక్టోబర్‌లో ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొత్తానికి ఏం జరిగిందో ఏమో కానీ ఫ్యాన్స్‌ను సంతోషపెట్టేలా ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదల అవుతుందని తెలిపారు. దీంతో ఒక నెల ముందే ‘దేవర’ వస్తుండడంతో ప్రేక్షకులంతా సంతోషం వ్యక్తం చేశారు. చాలా ప్యాన్ ఇండియా సినిమాలలాగానే ‘దేవర’ కూడా రెండు భాగాల్లో విడుదల కానుంది.

Also Read: చిరు, చరణ్‌ల 'మెగా' మనసు - కేరళ బాధితులకు తండ్రీ కుమారుల విరాళం కోటి... బాసూ, నువ్వు గ్రేట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget