By: ABP Desam | Updated at : 12 Jan 2022 04:20 PM (IST)
ఓపెన్ డిబేట్‌కు రావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్
సినిమా వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై పలువురు ప్రముఖులు మండి పడుతున్నారు. ఉదయం ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేయగా.. మధ్యాహ్నం మరో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఎవరికి బలిసిందో తెలియాలంటే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. " సినిమా వాళ్లంటే చీప్‌గా కనిపిస్తున్నారా ? ఎవరు బలిశారు ?.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు?.. మీ చరిత్రలేంటి?.. వాటి గురించి మాట్లాడదామా?.. ఓపెన్ డిబేట్‌కు వస్తారా ఎవరైనా?.. దమ్ముందా?.. " అని తమ్మారెడ్డి భరద్వాజ సవాల్ చేశారు.
Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని
మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?సినిమా కోసం వందల మంది కష్టపడతారు. కష్టపడితే వచ్చే వచ్చే ప్రాజెక్టు అది. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలాగా రూపాయి పెట్టి కోట్లు దోచుకు తినడం లేదు. మమ్మల్ని అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి. రాజకీయ నేతలు బెదిరింపులకు పాల్పడవద్దన్నారు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నానని తమ్మారెడ్డి హెచ్చరించారు.
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మరో ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కూడా స్పందించారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిది బలుపు కాదు వాపని విమర్శించారు. అధికార అహంకారం తలెక్కితే పతనమే ఎదురవుతుందని ఆదిత్య హెచ్చరించారు. సినీ పరిశ్రమను చులకనగా మాట్లాడేవారి సంఖ్య ఏపీ అధికార పార్టీలో పెరుగుతూండటంతో ఒక్కొక్కరు బయటకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
India Railways: భారత్లో భారీగా రైల్వే ట్రాక్ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
Bihar Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్