NV Prasad : బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
బలిసికొట్టుకుంటోంది మీరేనని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డికి నిర్మాత ఎన్వీ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్‌పై ఆయన చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![NV Prasad : బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత ! Producer NV Prasad is angry with a YSRCP MLA who has spoken disrespectfully of the film industry NV Prasad : బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/174cf40510e03e21e5dafa0db66141c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమా ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై సినీ నిర్మాత, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరు.. బలిసి కొట్టుకుంటోంది మీరేనని రివర్స్‌లో విమర్శలు గుప్పించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని.. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని.. ప్రసన్నకుమార్ రెడ్డి అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దని సూచించారు.
వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందని సలహా ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదని..సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని సలహా ఇచ్చారు. నా సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తానన్నారు. సినిమా వాళ్లకు ఏపీ గుర్తు లేదని.. వారు బలిసి కొట్టుకుంటున్నారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెండు రోజుల కిందట విమర్శించారు.
ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సినీ నిర్మాతల మండలి .. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఎన్వీ ప్రసాద్ కూడా అదే డిమాండ్ చేశారు. అయితే నల్లపురెడ్డి మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ తన వ్యాఖ్యలపై ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. టిక్కెట్ల వివాదం కారణంగా ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ నేతలు సినీ పరిశ్రమపై కొద్ది రోజులుగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన వారు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)