Talasani: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని
తెలంగాణలో కూడా త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్ లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్వెల్లడించారు. అయితే, వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేశారు.
![Talasani: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని Minister Talasani srinivas yadav responds over tollywood movie tickets issues in AP Talasani: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/16/279a67c99d23b292c8646fa4454c08c1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత అఖండ, పుష్ప చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమకు మంచి ఊపు వచ్చిందని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పరిశ్రమకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించామని, అంతేకాక, ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. బుధవారం తలసాని తెలుగు చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై వేలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, అందుకే వారి సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో కూడా త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్ లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్వెల్లడించారు. అయితే, సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టే ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు మరింత గట్టింగా కనుక ఉంటే మళ్లీ థియేటర్లపై ఆంక్షలు తప్పవని తేల్చా చెప్పారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
ఏపీలో పరిస్థితులపైనా స్పందించిన మంత్రి
ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంపై కూడా మంత్రి తలసాని స్పందించారు. ‘‘ఏపీలో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో నేను మాట్లాడతాను. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. త్వరలోనే ఆన్ లైన్ సినిమా టికెట్ల పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
Also Read: వన్ సైడ్ లవ్, టు సైడ్ లవ్‌పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
Also Read: KCR : పెంచిన ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన.. కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక !
Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)