Captain Millar Telugu Trailer Release: ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' తెలుగు ట్రైలర్ రిలీజ్
Dhanush Captain Miller Telugu Trailer: ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మూవీ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు మేకర్స్. ట్విటర్ వేదికగా ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీం.
Dhanush Captain Miller Telugu Trailer: సంక్రాంతి పండగకు తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సినిమాల సందడి బాగానే సాగింది. తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయినట్టుగానే.. తమిళంలో కూడా రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అయితే.. మరొకటి శివకార్తికేయన్ లీడ్ రోల్ చేసిన ‘అయాలన్’. ఈ రెండు సినిమాలు జనవరి 12న విడుదలయ్యి పోటాపోటీగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలు తెలుగులో మాత్రం కాస్తా ఆలస్యంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పండుగ సందర్భంగా తెలుగు బాక్సాఫీసు వద్ద స్టార్ హీరోల సినిమాల పోటీ ఉండటంతో 'కెప్టెన్ మిల్లర్', 'అయాలన్' చిత్రాలు వెనక్కి తగ్గాయి.
దీంతో ఈ నెలలో చివరిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 'కెప్టెన్ మిల్లర్' జనవరి 25న తెలుగులో రిలీజ్ అవుతుండగా అయాలన్ జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మూవీ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు మేకర్స్. ట్విటర్ వేదికగా ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీం. కాగా తమిళ్ దర్శకుడు అరుణ్ మథేశ్వరన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో కెప్టెన్ మిల్లర్ తెరకెక్కించారు. తెలుగులో ఈ 3మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.
ట్రైలర్ ఇలా సాగింది..
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ తెల్లదొరలంతా దొంగలు అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలైంది. "నీలాగా నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. వాడిని నేనే చంపేదానిని.." అంటూ హీరోయిన్ ప్రియాంక మోహన్ చెబుతున్న డైలాగ్ తో సాగింది. స్వాతంత్ర నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ శాంతం ఆసక్తిగా సాగింది. మొత్తానికి ట్రైలర్.. తెల్లదొరలకు వ్యతిరేకంగా కెప్టెన్ మిల్లర్ అండ్ టీం ఎలా పోరాడిందనే నేపథ్యంలో ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తూ. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తమిళ్ లో ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్..
‘కెప్టెన్ మిల్లర్’ సినిమా మొదటిరోజే రూ.8.80 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అంతే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి సైతం పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంది. చూసినవారంతా ఎక్కువశాతం పాజిటివ్ రివ్యూలే ఇచ్చినా కూడా ఎందుకో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వచ్చింది. అలా రెండో రోజు రూ.7.55 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.7.40 కోట్లకు పడిపోయాయి ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్. మొత్తంగా ఇప్పటికీ ఈ మూవీ రూ.23.75 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి వీకెండ్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయని ధనుష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్ రోజురోజుకీ తగ్గుతూ వస్తే.. ‘అయాలన్’ కలెక్షన్స్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి.
Here's the @dhanushkraja's Massive action extravaganza #CaptainMillerTelugu Trailer!
— Suresh Productions (@SureshProdns) January 17, 2024
▶️ https://t.co/e10wimzOoT
Grand Release By @AsianCinemas_ and @SureshProdns on JANUARY 25th💥#ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi… pic.twitter.com/G2uzJ3sFGW