Suriya: ఎన్‌టీఆర్ కోసం తమిళ హీరో సూర్య త్యాగం - లైన్ క్లియర్!
Suriya: శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రమే ‘కంగువ’. ఈ మూవీ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎన్‌టీఆర్ కోసం ‘కంగువ’ విషయం కీలక నిర్ణయం తీసుకున్నాడట సూర్య.
Suriya for Devara: ఇటీవల బాక్సాఫీస్ వార్ జోరుగా సాగుతోంది. మొన్న ‘సలార్’, ‘డంకీ’ మూవీస్ మధ్య పోటీ నెలకొంటే.. ఈ సంక్రాంతికి ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’, ‘నా సామిరంగ’, ‘సైంధవ’ మూవీస్ మధ్య పోటీ నెలకొంది. దీనివల్ల థియేటర్లు దొరకని పరిస్థితి. అలాగే, ప్రేక్షకులకు కూడా ఏ మూవీకి వెళ్లాలా అని తేల్చుకోలేని పరిస్థితి. దీనివల్ల సాధారణ రోజుల్లో హిట్ అయ్యే మూవీ కూడా.. ఈ పోటీ వల్ల షెడ్‌కు వెళ్లిపోతుంది. నిర్మాతలు కూడా నష్టపోతారు. త్వరలో ఈ పరిస్థితి దక్షిణాదికి చెందిన రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య కూడా నెలకొనే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అందుకే, ముందుచూపుతో తమిళ హీరో సూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎన్‌టీఆర్ కోసం తమిళ హీరో సూర్య త్యాగానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలయిన గ్లింప్స్, ఫస్ట్ లుక్.. ఇలా అన్ని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇక ఎన్‌టీఆర్ కోసం తన ‘కంగువ’ విడుదల తేదీని త్యాగం చేయనున్నాడట సూర్య.
‘దేవర’ కోసం సూర్య నిర్ణయం..
ఇప్పటికే ‘కంగువ’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లనుంది. ఏప్రిల్‌లో ఎలాగైనా ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఇంతలోనే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ కూడా ఏప్రిల్‌లోనే విడుదల అని ప్రకటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’లాంటి హిట్ రాగా.. అదే తరహాలో ‘దేవర’ కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఏప్రిల్ 5న ‘దేవర’ మూవీ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎన్‌టీఆర్ కోసం, తన ఫ్యాన్స్ కోసం ‘కంగువ’ రిలీజ్ డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడట సూర్య.
రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు..
ఏప్రిల్ 5న విడుదల కానున్న ‘కంగువ’ను పోస్ట్‌పోన్ చేయాలని తన టీమ్‌తో చర్చలు జరిపాడట సూర్య. ‘దేవర’కు ‘కంగువ’ పోటీ కాకూడదని, సోలోగా విడుదల చేసుకుంటే మంచి కలెక్షన్లు రాబట్టవచ్చని సూర్యతోపాటు మేకర్స్ కూడా భావించినట్టు సమాచారం. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే. రెండూ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. కాబట్టి పోటీ లేకుండా విడుదలయితేనే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ‘కంగువ’ మేకర్స్.. ‘దేవర’తో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతే కాకుండా ‘కంగువ’ మూవీ వీఎఫ్ ఎక్స్, ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా పెండింగ్ ఉండడంతో అన్నీ పూర్తి చేసుకొని మంచి క్వాలిటీతో ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ భావిస్తున్నారట.
సౌత్‌లో బాలీవుడ్ భామలు..
శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువ’తో దర్శకుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని అనుకుంటున్నాడు. ఇప్పటివరకు విడుదయిన ఫస్ట్ లుక్, టీజర్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ పాత్ర మేక్ ఓవర్ కోసం సూర్య చాలా కష్టపడినట్టు కూడా తెలుస్తోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. దిశాకు తమిళంలో ఇదే మొదటి చిత్రం. ఇక ‘దేవర’ విషయానికొస్తే.. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. తాజాగా విడుదలయిన మూవీ గ్లింప్స్‌లో ఎన్‌టీఆర్ లుక్, డైలాగ్స్, మేక్ ఓవర్.. ఇలా అన్నీ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపాయి. ఈ గ్లింప్స్ వల్ల ప్రేక్షకుల్లో ‘దేవర’పై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Also Read: కుక్కచావు చచ్చేలా చేస్తా - షారుఖ్ వ్యాఖ్యలు ‘యానిమల్’ పైనేనా?