By: ABP Desam | Updated at : 20 Apr 2023 05:12 PM (IST)
ఏజెంట్(Image Credits : Akhil Akkineni_Mahesh Babu/Twitter)
Mahesh Babu: సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల కావడంతో భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం అఖిల్ యాక్షన్ సీన్స్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సినిమా టీజర్ తో పాటు, అఖిల్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు.
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' ను ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై నిర్మించారు. ఈ చిత్రం లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, పాటలు అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి. 'ఏజెంట్' ట్రైలర్ ను కాకినాడలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఏప్రిల్ 19న మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికొస్తే ఆద్యంతం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేయడంతో అఖిల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఖిల్ ఇరగదీశాడనే తెలుస్తోంది. బీస్ట్ లుక్ లో కనిపించనున్న అఖిల్.. ఈ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటాడని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల రిలీజైన 'ఏజెంట్' ట్రైలర్ అందర్నీ అమాంతం కట్టిపడేస్తోంది. దీంతో సాధారణ ప్రేక్షకులే కాదు ప్రముఖ సినీ నటులు కూడా మూవీ ట్రైలర్, అఖిల్ యాక్షన్ ను పొగుడుతున్నారు. స్పై పాత్రలో అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు సైతం అఖిల్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని, అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా ఉందంటూ మహేశ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ సినిమాను విలాసవంతమైన స్థాయిలో తెరకెక్కించిన అనిల్ సుంకరకు ఆయన అభినందనలు తెలిపారు. దీంతో మహేశ్ బాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
#AgentTrailer looks impressive! Stunning transformation @AkhilAkkineni8!! 👍🤗 Special mention to @anilsunkara1 for making the film on such a grand scale! Wishing the entire team all the best!! ❤️https://t.co/m7cdxRUM0i @DirSurender @mammukka @sakshivaidya99
— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2023
ఇదిలా ఉండగా యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తోన్న 'ఏజెంట్' చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదట్లో తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమిజా పాటలు సమకూర్చారు. 2021లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో హిట్ అందుకున్న అక్కినేని అఖిల్.. మళ్లీ 'ఏజెంట్' సినిమాతో భారీ హిట్ కొడతాడని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు.
Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్
Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్'లో శకుని ఆరోగ్య పరిస్థితి
Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు
Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం