By: ABP Desam | Updated at : 19 Apr 2023 08:00 AM (IST)
Photo@Social Media
ఇండియాలో సినీ స్టార్స్, క్రికెటర్లకు ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు ఏం చేసినా పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుంది. అందుకే చాలా సంస్థలు తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా నియమించుకుంటారు. మరికొన్ని కంపెనీలు సినీ, క్రీడా ప్రముఖులతో యాడ్స్ చేయించుకుంటాయి. టీ పౌడర్ నుంచి ఆభరణాల వరకు అన్నింటిని ప్రమోట్ చేస్తుంటారు పలువురు సెలబ్రిటీలు. ఒక్కో యాడ్ కు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. అయితే, ఒక్కోసారి కొన్ని యాడ్స్.. అందులో నటించిన స్టార్స్ కు తలనొప్పులు తెచ్చిన సందర్భాలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు చూద్దాం..
అందాల తార ఐశ్వర్య రాయ్ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ లో నటించింది. అయితే, ఈ యాడ్ లో ఐశ్వర్య వెనుక ఓ అమ్మాయి గొడుగు పట్టుకుని ఉంటుంది. ఆ అమ్మాయి నల్లగా ఉండటంతో, జాత్యంహకారాన్ని పోత్సహించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఒకప్పుడు బిగ్ బి అమితాబ్ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కానీ, జైపూర్‌లోని ఓ పాఠశాల విద్యార్థిని.. “మా టీచర్లు పెప్సీ ఒక విషం అని చెప్తున్నారు. మీరు ఎందుకు ఆ ప్రకటనలో నటిస్తున్నారు?” అని ప్రశ్నించడంతో అమితాబ్ అప్పటి నుంచి ఆ బ్రాండ్ కు ప్రచారం చేయడం మానేశారు.
UB గ్రూప్ అప్పట్లో MS ధోనీ & హర్భజన్ వేర్వేరు లిక్కర్ కంపెనీ యాడ్స్‌లో నటించారు. హర్బజన్ నటించిన లిక్కర్ యాడ్ కౌంటర్‌గా పోటీ సంస్థ ధోనీతో మరో యాడ్ చేసింది. అందులో హర్బజన్ యాడ్‌కు కౌంటర్ వేసింది. అయితే, ఆ కౌంటర్ హర్బజన్ తండ్రిని కించపరిచేలా, సిక్కు సమాజాన్ని అగౌరవ పరిచేలా ఉందనే కారణంతో వివాదం నెలకొంది. దీంతో ఆ ప్రకటనను నిలిపేశారు.
అమితాబ్ కచ్చా మాంగ్ యాడ్ చేశారు. ఇందులో అమితాబ్.. రాళ్లతో మామిడి కాయలు కొడ్తుంటాడు. అమితాబ్ ను చూసి పిల్లలు కూడా అలాగే చేస్తున్నారని తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్స్ రావడంతో ఆయన ఈ యాడ్ చేయడం మానేశారు.
రీసెంట్ గా అలియా భట్ మాన్యవర్ కు సంబంధించిన కమర్షియల్ యాడ్ చేసింది. ఇందులో కన్యాదాన్ అనే హిందువుల ఆచారాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని హిందూ సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఈ యాడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్ ఓ ఫ్యాషన్ షోకు సంబంధించిన ప్రమోషన్ యాడ్ చేశారు. ఇందులో తన భార్య ట్వింకిల్ ఖన్నాతో పాంట్ బటన్స్, జిప్ తీయిస్తారు. ఈ యాడ్ అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది.
రష్మిక అమూల్ మాచో యాడ్‌లో విక్కీ కౌశల్ వేసుకున్న అండర్ వేర్‌ను తదేకంగా చూస్తుంది. ఈ యాడ్ పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ నడించింది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల రాపిడో యాడ్ చేశారు. ఇందులో TSRTCని కించపరిచారంటూ TSRTC MD సజ్జనార్ ర్యాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్‌లకు లీగల్ నోటీసులు పంపించారు. ఆ తర్వాత ఈ యాడ్ మళ్లీ మార్చి షూట్ చేశారు.
Read Also: లేడీ ఓరియేంటెడ్ మూవీస్‌తో చేతులు కాల్చుకున్న హీరోయిన్లు - కటౌట్ కాదు కంటెంట్ ఉండాలి!
Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ
Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?
Brahmamudi May 29th: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?
Ennenno Janmalabandham May 29th: ఆదిత్యని వెళ్ళగొట్టిన అభిమన్యు- తప్పతాగి రోడ్డు మీద తిరుగుతున్న మాళవిక
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!