అన్వేషించండి

లేడీ ఓరియేంటెడ్ మూవీస్‌తో చేతులు కాల్చుకున్న హీరోయిన్లు - కటౌట్ కాదు కంటెంట్ ఉండాలి!

ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న స్టార్ హీరోయిన్స్ అటు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. మొదట్లో మంచి హిట్లు కొట్టినా.. ఆ తర్వాత కథల ఎంపికలో తడబడుతూ పరాజయాలు చూస్తున్నారు.

ప్రస్తుతం సౌత్ సినీ ఇండ్రస్ట్రీ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్స్ సైతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం భారీ మార్కెట్ ఉన్న హీరోయిన్స్ తో ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి, సమంత, నయనతార, తాప్సి ముందు వరుసలో ఉంటారు. ఒక్కోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్లాప్స్ అందుకున్న హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. వారి జాబితాలో ఇప్పుడు సమంత కూడా చేరింది. తాజాగా ‘శాకుంతలం’ మూవీతో సమంత ఫ్లాప్ అందుకుంది. మరి, లేడి ఓరియెంటెడ్ మూవీస్‌తో ఫ్లాప్స్ అందుకున్న ఇతర హీరోయిన్లు ఎవరో చూద్దామా.

అనుష్క

నిజానికి మన టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పునాది వేసింది అనుష్కనే. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘అరుంధతి’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇక ఆ తర్వాత ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో భారీగా మార్కెట్ పెరగడంతో నిర్మాతలు మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించారు కానీ చాలా వరకు ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్స్ గా నిలిచాయి  ఇక ‘అరుంధతి’ తరవాత అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పంచాక్షరీ , సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం.. వీటిలో ‘భాగమతి’ మాత్రమే ఓ మోస్తరు విజయం అందుకుంది ఇక నిశ్శబ్దం తర్వాత మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల జోలికి పోలేదు ఈ ముద్దుగుమ్మ  

సమంత

సౌత్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించిన సమంత ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది అలా సమంత ఇప్పటివరకు ఈ అమ్మడు లీడ్ రోల్ లో నటించిన యూ టర్న్, ఓ బేబీ, యశోద.. సినిమాలు మంచి హిట్స్ అందుకోగా.. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ మాత్రం నిరాశపరిచింది ఎన్నో అంచనాల నడుమ ఇటీవల రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

నయనతార

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిందిసౌత్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఘనత కూడా ఈ హీరోయిన్దే  కావడం విశేషం. ఇక ఈమె తమిళంలో నటించిన ‘కో కో కోకిల’, ‘వసంతకాలం’, ‘అమ్మోరు తల్లి’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎక్కువ సక్సెస్ రేట్ నయనతార కే ఉంది. అయితే, ఈ మధ్య ఈ హీరోయిన్ నటించిన O2 ,కనెక్ట్ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రం అంతగా ఆకట్టుకొలేక పోయాయి.

ఐశ్వర్య రాజేష్

ప్రస్తుతం తమిళంలో నయన్ తర్వాత ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఈ హీరోయిన్ నటించిన గ్రేట్ ఇండియన్ కిచెన్, డ్రైవర్ జామున, రన్ బేబీ రన్ వంటి సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడున్న యంగ్ జెనెరేషన్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాజేష్ అటు కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే, ఈమె ఇటీవల నటించిన ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ (మలయాళం రీమేక్ చిత్రం) ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాప్సి

ఈ హీరోయిన్ తెలుగులో కంటే హిందీలో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. కానీ అవేమి ఈమెకి సక్సెస్ ని అందించలేక పోయాయి. ఇటీవల కాలంలో తాప్సి నటించిన బాలీవుడ్ మూవీస్ శభాష్ మిథు, దోబారా, తప్పడ్ వంటి సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. అయినా కూడా తాప్సి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.

ఇక ఈ మధ్య రెజీనా కాసాండ్రా కూడా శాకినీ డాకిని అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేసి భారీ ప్లాప్ ని అందుకుంది.

ఏదేమైనా ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ కొత్త కంటెంట్స్ ఉన్న సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంత స్టార్‌డమ్ ఉన్నా.. కథలో కొత్తదనం లేకపోతే అంతే సంగతులు. అది కమర్షియల్ మూవీ అయినా? లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా?.. అందుకే ఇప్పటికైనా దర్శకనిర్మతలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ కోసం స్టార్ హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు.. అందుకు తగ్గ కథను కూడా ఎంచుకుంటే బావుంటుంది.

Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్

 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget