అన్వేషించండి

Ooru Peru Bhairavakona: వాలెంటైన్స్ డేకు ‘ఊరు పేరు భైరవకోన’ స్పెషల్ ప్రీమియర్స్ - స్వయంగా టికెట్లు అమ్ముతానంటున్న హీరో

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలోనే ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. వాలెంటైన్స్ డేకు స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేయడాలని మేకర్స్ నిర్ణయించారు.

Ooru Peru Bhairavakona Valentines Day Premiere: యంగ్ హీరో సందీప్ కిషన్.. ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేవు. అయినా కూడా డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో ఏ మాత్రం వెనకాడడు ఈ హీరో. అదే విధంగా త్వరలోనే ‘ఊరు పేరు భైరవకోన’ అనే మరో కొత్త రకమైన చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16న రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్‌ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న సందీప్.. తానే స్వయంగా టికెట్లు కూడా అమ్మడానికి ముందుకొచ్చాడు.

వాలెంటైన్స్ డే ప్రీమియర్స్..

ఫిబ్రవరీ 16న ‘ఊరు పేరు భైరవకోన’ థియేటర్లలో సందడి చేయగా.. దానికంటే రెండురోజుల ముందు నుండే ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఇక ఫిబ్రవరీ 10 నుండే ప్రమోషన్స్ టూర్‌ను ప్రారంభించిన మూవీ టీమ్.. ఈ టూర్‌లో ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనుంది. అందులో భాగంగానే వైజాగ్‌లోనే ఓ థియేటర్‌లో సందీప్ కిషన్.. స్వయంగా తన ప్రీమియర్ టికెట్స్ అమ్మనున్నాడు. అది కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రీమియర్స్. ఈ విషయాన్ని సందీప్ కిషన్.. స్వయంగా తన ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఇక మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే చాలామంది ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవుతోంది.

వైజాగ్‌లోనే ప్రమోషన్స్..

‘ఫిబ్రవరీ 10న సాయంత్రం 6 గంటలకు వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో వాలెంటైన్స్ డే ప్రీమియర్స్‌కు సంబంధించిన టికెట్స్ పర్సనల్‌గా అమ్ముతాను. ఫిబ్రవరీ 14న ప్రీమియర్స్’ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే యాక్టర్స్.. తమ సినిమాలకు తామే టికెట్స్ అమ్మడం కొత్త విషయమేమి కాదు. సడెన్‌గా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసి టికెట్ కౌంటర్‌లో కూర్చోవడం యాక్టర్స్‌కు అలవాటే. మొదటిసారి తన ప్రీమియర్ షో టికెట్లు.. తానే అమ్ముతున్నానని సందీప్ కిషన్ ముందే ప్రకటించాడు. ఫిబ్రవరీ 10న ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్ కోసం వైజాగ్ వెళ్తున్న టీమ్.. 14 వరకు అక్కడే ఉండనున్నారని అర్థమవుతోంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రమోషన్స్ జరుగుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.

తప్పుకుంటూ వచ్చింది..

విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఊరు పేరు భైరవకోన’లో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లామా, కావ్య థాపర్ నటించారు. ముందుగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే చాలా సినిమాలో రేసులో ఉండడంతో తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరీ 9న విడుదల అవుతున్నట్టు ప్రకటించింది. అప్పిటికే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీకి సోలో రిలీజ్ అందిస్తామని నిర్మాతలంతా ప్రకటించడంతో.. వారి నిర్ణయాన్ని గౌరవించి మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది ‘ఊరు పేరు భైరవకోన’. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాతో అయితే సందీప్ కమర్షియల్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: ‘దేవర’ మూవీలో మరో బ్యూటీ, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News: దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News: దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
Viral News: ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
Vijayasai Reddy Comments : జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Dil Raju On Gaddar Awards: ఏప్రిల్‌లో 'గద్దర్' అవార్డ్స్... పదేళ్లలో సినిమాలకు ఒకే వేదికపై - దిల్ రాజు కీలక ప్రెస్‌మీట్‌
ఏప్రిల్‌లో 'గద్దర్' అవార్డ్స్... పదేళ్లలో సినిమాలకు ఒకే వేదికపై - దిల్ రాజు కీలక ప్రెస్‌మీట్‌
AP IPS officers: ముగ్గురు ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ పొడిగింపు - జెత్వానీ కేసే కారణం !
ముగ్గురు ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ పొడిగింపు - జెత్వానీ కేసే కారణం !
Embed widget