Prabhas - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్? - అదీ తెలంగాణ నేపథ్యంలో?
ఇప్పుడు ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, సిద్ధార్థ్ ఆనంద్... పాన్ ఇండియా దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ సుకుమార్ తో చేయనున్నారని గుసగుస.
దర్శకుడు సుకుమార్ (Sukumar)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానుల్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. ఒకానొక సందర్భంలో సుకుమార్ మాస్ మీద దృష్టి పెడితే మనం సర్దుకోవాలేమో అని సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూసినప్పుడు అనిపిస్తుందని జక్కన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన రేంజ్ ఆస్కార్ వరకు వెళ్ళింది. అయితే, ఆయన ఆశించినట్టు సుకుమార్ మాస్ సినిమా తీశారు. 'పుష్ప'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. దానికి ముందు రామ్ చరణ్ 'రంగస్థలం'తో మాస్ అంటే ఏంటో చూపించారు. ఇప్పుడు 'పుష్ప 2' తీస్తున్నారు. దాని తర్వాత?
ప్రభాస్ హీరోగా సుక్కు సినిమా?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా సుకుమార్ ఓ సినిమా చేయడానికి సన్నాహాల్లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల హీరోని కలిసి కథ వినిపించారట. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్ ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ... అది ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చని, ప్రభాస్ సినిమా ముందు తెరకెక్కే అవకాశం ఉందని టాలీవుడ్ గుసగుస.
రజాకార్ల నేపథ్యంలో... ప్రభాస్ కోసం రజాకార్ల నేపథ్యంలో సుకుమార్ ఓ కథ రెడీ చేశారట. కొన్ని రోజులుగా ఆయన ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని, పాన్ ఇండియా రెబల్ స్టార్ అయితేనే ఆ కథకు బావుంటుందని ఆయనకు వినిపించారని తెలుస్తోంది. 'పుష్ప 2' తర్వాత ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారట.
Also Read : 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?
ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారంటే దానికి కారణం 'బాహుబలి'. ఆ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. వాళ్ళతో ఓ సినిమా చేయాలని ప్రభాస్ కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఓ కథ కూడా ఫైనలైజ్ చేశారాని వినిపించింది. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన ఏ పాత్రతో పోల్చి చూసినా సరే సంబంధం ఉండదట. కొత్త తరహా పాత్రలో ప్రభాస్ కనబడతారని, 'బాహుబలి' కంటే ఇది డిఫరెంట్ సినిమా అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. బహుశా... ఆ కథ సుక్కు కథేనా? కొన్ని రోజులు ఆగితే క్లారిటీ రావచ్చు.
Also Read : 'జల్లికట్టు' రివ్యూ : ఆహాలో వెట్రిమారన్ వెబ్ సిరీస్ - మళ్ళీ అగ్ర కులాలదే తప్పంటూ...
ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... ఆయన చేతిలో నాలుగు ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో 'ఆదిపురుష్' చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. 'సలార్' చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్ చేస్తున్నారు ప్రభాస్. ఇంకా సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా సినిమాలు లైనులో ఉన్నాయి. మారుతి సినిమాకు 'రాజా డీలక్స్' టైటిల్ ఖరారు చేశారట.
రెండు భాగాలుగా 'సలార్'
ఆల్రెడీ 'ఆదిపురుష్' ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దాని తర్వాత 'సలార్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఒక భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రెండు పార్టులుగా విడుదల అవుతుందా? అని నిన్న మొన్నటి వరకు సందేహాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ, ప్రభాస్ గానీ, నిర్మాతలు గానీ ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నడ నటుడు దేవరాజ్ 'సలార్' రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిపారు.