SSMB29: సంజీవని అన్వేషణలో మహేష్... రాజమౌళి సినిమాలో సెంటర్ పాయింట్ అదేనా?
Mahesh Rajamouli Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంజీవని అన్వేషణలో పడ్డారా? ఆయనతో రాజమౌళి తీస్తున్న సినిమా కథలో సెంటర్ పాయింట్ అదేనా?

'బాహుబలి'తో ఒక సోషియో ఫాంటసీ వరల్డ్ క్రియేట్ చేసి ప్రేక్షకులు అందరినీ అందులోకి తీసుకువెళ్లి భారీ విజయం అందుకున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. త్వరలో వెండితెరపై రామాయణ స్ఫూర్తితో సృష్టించిన ప్రపంచంలోకి తీసుకు వెళ్లబోతున్నారా? అంటే... సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఒకసారి కొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సంజీవని అన్వేషణలో సూపర్ స్టార్!?
రామాయణం గుర్తుందా? లక్ష్మణుడిని బ్రతికించడం కోసం సంజీవని తీసుకు రమ్మని రాముడికి చెబితే... సంజీవని కోసం వెళ్లిన వాయుపుత్రుడు (హనుమంతుడు) ఆ కొండ మీద ఉన్న వాటిలో సంజీవని ఏదో తెలియక కొండను తీసుకు వస్తాడు. ఇప్పుడు ఆ సంజీవని కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అన్వేషణలో పడ్డారట.
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న సినిమాలో సంజీవని సెంటర్ పాయింట్ అని ఫిలిం నగర్ వర్గాల ద్వారా వినబడుతున్న సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమా SSMB29 అని రాజమౌళి, ఆయన తండ్రి - స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు చెప్పారు. ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ దేని కోసం వెతుకుతారు అంటే సంజీవని కోసం అట! మరణించిన మనిషిని బ్రతికించే శక్తి సంజీవనికి ఉందనేది పురాణ ఇతిహాసాలలో చెప్పిన విషయం. మరి ఎవరిని బ్రతికించడం కోసం మహేష్ ఆ సంజీవని వేటలో పడ్డారు? అనేది సినిమా చూస్తే తప్ప తెలియదు.
Also Read: షాక్ ఇచ్చిన 'కుబేర' సెన్సార్ రిపోర్ట్... ఇప్పుడు భారం అంతా ధనుష్, నాగార్జున పైనే
మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలన్ క్యారెక్టర్ కోసం తమిళ హీరో మాధవన్ పేరు పరిశీలనలో ఉందంట. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్





















