Akhanda 2: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్
Aadhi Pinisetty Look In Akhanda 2: 'అఖండ 2'లో ఆది పినిశెట్టి విలన్. అది కూడా సాదాసీదా విలన్ కాదు... ఒక రేంజ్ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. కనిపించినది ఒక్క క్షణం అయినా ఇంపాక్ట్ చూపించాడు ఆది.

బాలకృష్ణ ఒక పవర్ హౌస్. యాక్టింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు... ఆయన స్క్రీన్ మీదకు వస్తే ఇంకెవరినీ ఆడియన్స్ చూడలేరు. ఆయన తప్ప ఆడియన్స్ కళ్లు ఇంకెవరినీ చూడవు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అటువంటిది. బాలకృష్ణ ముందు ఒక్క క్షణం కనిపించి ఇంపాక్ట్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. 'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా' వంటి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య ముందు ఒక్క చూపుతో తన ఉనికి బలంగా చూపించాడు ఆది పినిశెట్టి.
'అఖండ 2' టీజర్‌లో ఆ లుక్కు ఆది పినిశెట్టిదే!
Akhanda 2 Teaser Reaction: 'అఖండ 2' టీజర్‌కు బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ నుంచి ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ వస్తోంది. ఆయన లాంగ్ హెయిర్ లుక్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, బాలయ్య నడుస్తుంటే సుదర్శన చక్రంలా త్రిశూలం తిరుగుతూ ఉంటే టెర్రరిస్టులు చావడం కానీ ప్రతిదీ ఒక గూస్ బంప్స్ మూమెంట్.
బాలకృష్ణ లుక్కు నుంచి డైలాగ్ డెలివరీ, ఆ విజువల్స్ వరకు ప్రతిదీ సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యేలా దర్శకుడు బోయపాటి శ్రీను 'అఖండ 2' టీజర్ కట్ చేశారు. అయితే... మధ్యలో ఒకే ఒక్క లుక్కుతో ఆది పినిశెట్టి కూడా బాగా రిజిస్టర్ అయ్యారు.
'అఖండ 2'లో ఆది పినిశెట్టి విలన్. ఆల్రెడీ ఆ విషయం అనౌన్స్ చేశారు. 'సరైనోడు' సినిమాతో ఆదిని విలన్ చేసింది బోయపాటి శ్రీనుయే. అందులో అతడి నటనకు మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు మరోసారి ఈ యంగ్ హీరోకి ఎటువంటి విలన్ క్యారెక్టర్ ఇచ్చారోనని ఆడియన్స్ వెయిట్ చేశారు. బోయపాటి ప్రతి సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. విలన్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందని నమ్మే దర్శకులలో బోయపాటి ఒకరు.
Also Read: బాలకృష్ణ 2.0 లోడింగ్... పాన్ ఇండియా రేంజ్‌లో రుద్ర తాండవం - మాస్ జాతర గ్యారెంటీ
Aadhi Pinisetty villain role and look in Akhanda 2 revealed: 'అఖండ' క్లైమాక్స్‌లో పరమశివుడు ఆవహించడంతో రుద్ర తాండవం చేసిన అఘోర (బాలకృష్ణ)కు ధీటుగా విలనిజం పండించాలంటే దుష్ట అఘోర (ఆది పినిశెట్టి) కరెక్ట్ అని బోయపాటి శ్రీను భావించినట్టు ఉన్నారు. 'అఖండ 2 తాండవం' టీజర్ చూస్తే అలాగే ఉంది. ఒక్క లుక్కుతో ఆది పినిశెట్టి భయపెట్టారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అతని క్యారెక్టర్ మీద మరింత క్లారిటీ రావచ్చు.
టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. తమిళంలో తన తొలి సినిమా, హీరోగా రెండో సినిమా 'మృగం'తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. 'నిన్ను కోరి', 'అజ్ఞాతవాసి', 'రంగస్థలం', 'ది వారియర్' సినిమాలతో నటనలో వేరియేషన్స్ చూపించారు. అయితే... అతడికి సరైన బ్రేక్ రాలేదని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులలో కొందరు సైతం ఫీలవుతుంటారు. 'అఖండ 2'తో అతనికి బ్రేక్ రావడం ఖాయమని అర్థమవుతోంది. ఒక వైపు విలన్ రోల్స్ చేయడంతో పాటు హీరోగా సినిమాలు చేయడం ఆది పినిశెట్టి స్టైల్.





















