అన్వేషించండి

Rajamouli : విశ్వక్ సేన్ 'గామి'పై రాజమౌళి స్పెషల్ పోస్ట్ - నెట్టింట వైరల్!

S S Rajamouli : విశ్వక్ సేన్ 'గామి' సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

S S Rajanouli Special Post On Gaami : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మొన్నటిదాకా కమర్షియల్, మాస్ సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి 'గామి'తో ప్రయోగాల బాటపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. విశ్వక్ సేన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన 'గామి' ట్రైలర్ పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి కూడా చేరిపోయారు. 'గామి' సినిమా గురించి రాజమౌళి తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

'గామి' పై రాజమౌళి స్పెషల్ పోస్ట్

రాజమౌళి తన ఇన్ స్టా గ్రామ్ లో 'గామి' సినిమా గురించి పోస్ట్ చేస్తూ.." కఠోరమైన కృషి వుంటే అసాధ్యమైన కలలు కూడా సాకారమవుతాయి. 'గామి' సినిమా గురించి నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నన్ను కలిసి నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. సినిమాలోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థమైంది. మార్చ్ 8 గామి రిలీజ్ సందర్భంగా టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు.


Rajamouli : విశ్వక్ సేన్ 'గామి'పై రాజమౌళి స్పెషల్ పోస్ట్ - నెట్టింట వైరల్!

ఆ విషయంలో కాంతారాని ఫాలో అవుతాం - విశ్వక్ సేన్

'గామి' సినిమా మార్చి 8న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈచిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీం స్పెషల్ పోస్టర్ తో వెల్లడించారు. కాగా 'గామి' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడంపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. "రిషబ్ శెట్టి నటించిన కాంతారా కూడా మొదట ఒక్క భాషలోనే రిలీజ్ అయింది. అక్కడ భారీ సక్సెస్ అవ్వడంతో తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'గామి' విషయంలోనూ మేము అదే ఫాలో అవుతాం. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మిగతా భాషల్లో విడుదల చేస్తాం. కచ్చితంగా ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నాడు.

'SSMB29' షూటింగ్ ఎప్పుడంటే

రాజమౌళి - మహేష్ బాబు మూవీకి సంబంధించిన స్క్రీప్ట్ ఇప్పటికే సిద్ధమైపోయిందని, ఏప్రిల్ నెలలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి 'టైటానిక్', 'అవతార్' వంటి సినిమాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న దర్శకదిగ్గజం జేమ్స్ కామెరూన్ ఇండియా వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనతో పాటుగా 'ఇండియనా జోన్స్', 'జురాసిక్ పార్క్' వంటి సినిమాలను ప్రపంచానికి అందించిన మరో దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైతం హాజరుకానున్నారని సమాచారం. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే ఉద్దేశంతోనే రాజమౌళి.. వాళ్ళని ఆహ్వానిస్తున్నారని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : ‘యానిమల్’లో అది నాకు బాగా నచ్చింది, ఆయన సినిమాలకంటే ఇంట్వ్యూలే ఇష్టం: సందీప్‌పై శివకార్తికేయన్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget