By: ABP Desam | Updated at : 08 Jun 2023 09:47 PM (IST)
Photo Credit: VarunDhawan/Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధవన్తో కలిసి 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా 'సిటాడెల్' టీం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు. ద్రౌపతి ముర్ము ను సిటాడెల్ టీం సెర్బియాలోనే కలిసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు కూడా చేశాడు.
'సిటాడెల్ టీం ఇండియా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ మతి ద్రౌపతి ముర్ము గారిని కలిసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. సెర్బియాలో ద్రౌపతి ముర్ముజీ మేడం మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం' అంటూ తెలిపారు. ఇక సిటాడెల్ టీం తో ద్రౌపది ముర్ము కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సిడాటేల్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇప్పటికే ఇంగ్లీషులో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఫ్రీక్వెల్ గా ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడుతోంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది.
అటు జిమ్ లోనూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో తన యాక్షన్ స్టంట్స్ తో సమంత విశ్వరూపం చూపించబోతుందట. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సమంత. దేశవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అదరగొట్టేసింది. కాగా ఇప్పటికే ఫ్యామిలీ మెన్ రెండు సీజన్లను పూర్తి చేసుకోగా మేకర్స్ సీజన్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగులో సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్ లోనే ఉంది. అయితే సమంత మాత్రం 'ఖుషి' కంటే ఎక్కువగా 'సిటాటెల్' మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో సమంత ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
'హాయ్ నాన్న' నుంచి సెకండ్ సింగిల్ - 'గాజు బొమ్మ' సాంగ్ ఎప్పుడంటే?
నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
/body>