Rao Bahadur Teaser: డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ - మహేష్ బాబు నిర్మిస్తున్న 'రావు బహదూర్' టీజర్ చూశారా?
Rao Bahadur: సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా... తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.

Satyadev's Rao Bahadur Teaser Out: యంగ్ హీరో సత్యదేవ్ డిఫరెంట్ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రావ్ బహదూర్'. ఈ మూవీకి 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' ఫేం వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తుండగా... సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుండగా... తాజాగా టీజర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేశారు.
టీజర్ ఎలా ఉందంటే?
యంగ్ యూత్ నుంచి అమాయకత్వం, పవర్ ఫుల్ వృద్ధుని వరకూ అన్ని రోల్స్‌లోనూ సత్యదేవ్ తనదైన నటనతో టీజర్‌లో మెరుపులు మెరిపించారు. 'ఆచారి... నాకు భూతం పట్టుండాదిరా...' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... 'అనుమానం అనే పెనుభూతం నాకు పట్టుండాదిరా నాకు...' అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓ బ్రిటిష్ కాలం నాటి యువకుడిగా, యంగ్ వ్యక్తిగా, పిచ్చి పట్టిన ఓ వృద్ధుడిగా, మహారాజుగా అన్ని రోల్స్‌లోనూ సత్యదేవ్ కనిపించడం ఆసక్తిని పెంచేస్తోంది.
ఈ మూవీ క్షీణిస్తోన్న కులీనుల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధుని మానసిక సంఘర్షణ, గతం తాలూకా జ్ఞాపకాలు, లవ్ స్టోరీ, పవర్ ఫుల్ ప్లాష్ బ్యాక్ అన్నీ ఉన్నట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది. ఓ పాడుపడిన భవనం చుట్టూ సాగే కథ అని తెలుస్తుండగా... అసలు ఆ భవనం ఎవరిది? అందులో ఉన్న వృద్ధుడు ఎవరు? ఆయన గతం ఏంటి? ఈ భవనానికి పోలీసులకు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలను టీజర్‌లో సస్పెన్స్‌గా చూపించారు.
Possessed by the demon called 'DOUBT' 👤
— GMB Entertainment (@GMBents) August 18, 2025
𝗥𝗔𝗢 𝗕𝗔𝗛𝗔𝗗𝗨𝗥 will take you on a trippy ride like never before 🤯#RaoBahadur T̶E̶A̶S̶E̶R̶ NOT EVEN A TEASER out now!
▶️ https://t.co/cpnx1aukIj
𝗥𝗔𝗢 𝗕𝗔𝗛𝗔𝗗𝗨𝗥 / రావు బహదూర్ starring @ActorSatyaDev 🤩
ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అలరించే సత్యదేవ్ ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీ, రోల్స్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ డిఫరెంట్ రోల్స్‌లో ఆయన లుక్స్, నటన, డైలాగ్స్... మహారాజుగా ఆయన ఎంట్రీ, డార్క్ కామెడీ, సైకలాజికల్ టచ్ అన్నీ మూవీపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి. ఈసారి కూడా హిట్ కొట్టడం ఖాయమంటూ టీజర్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అనుపమ 'పరదా' To ఉదయభాను 'త్రిబాణధారి బార్బరిక్' వరకూ... - ఈ వీక్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ మూవీలో సత్యదేవ్‌తో పాటు వికాస్ ముప్పాళ్ల, దీప థామస్, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.





















