This Week Telugu Movies: అనుపమ 'పరదా' To ఉదయభాను 'త్రిబాణధారి బార్బరిక్' వరకూ... - ఈ వీక్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
Upcoming Telugu Movies: లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి కామెడీ, హారర్ థ్రిల్లర్స్ వరకూ ఈ వారం కూడా పలు మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఒకే రోజు 4 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Upcoming Movies Telugu In Theaters OTT Releases In August Third Week: మూవీ లవర్స్‌కు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పలు మూవీస్, వెబ్ సిరీస్‌లు రెడీ అయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకూ అటు థియేటర్స్ ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
అనుపమ 'పరదా'
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషించారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించగా... ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో అనుపమ కనిపించనున్నారు.
ఉదయభాను 'త్రిబాణధారి బార్బరిక్'
ప్రముఖ యాంకర్ ఉదయభాను నెగిటివ్ రోల్‌లో, సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా... స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి అడిదెల నిర్మించారు. సత్యరాజ్, ఉదయభానుతో పాటు వశిష్ట ఎన్ సింహ, సత్యం రాజేష్, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 22న మూవీ థియేటర్లలోకి రానుంది.
మేఘాలు చెప్పిన ప్రేమకథ
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. విపిన్ దర్శకత్వం వహించగా ఉమాదేవి కోట నిర్మించారు. రాధికా శరత్ కుమార్, సుమన్, ఆమని, వెంకటేష్ కాకుమాను, తనికెళ్ల భరణి, విద్యుల్లేఖ, తులసి, మోహన్ రామన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 22న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆర్.నారాయణమూర్తి 'యూనివర్శిటీ పేపర్ లీక్'
ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'యూనివర్శిటీ పేపర్ లీక్'. ఈ నెల 22న సినిమా థియేటర్లలోకి రానుంది.
Also Read: కూలీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... రజనీకాంత్ మూవీ హిట్టేనా? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చిరంజీవి 'స్టాలిన్' రీ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ 'స్టాలిన్' ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న రీ రిలీజ్ చేయనున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా... త్రిష హీరోయిన్. ప్రకాష్ రాజ్, శారద, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించారు.
ఓటీటీల్లోకి వచ్చే మూవీస్
ఆగస్ట్ 19 - ది బ్యాడ్ గాయ్స్ (ప్రైమ్ వీడియో), ఇలియో (ప్రైమ్ వీడియో), ఫెమిలియర్ టచ్ (ప్రైమ్ వీడియో), హౌస్ ఆన్ ఈడెన్ (ప్రైమ్ వీడియో)
ఆగస్ట్ 20 - ది మ్యాప్ దట్ లీడ్స్ టు యు (ప్రైమ్ వీడియో), రివర్స్ ఆఫ్ ఫేట్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)
ఆగస్ట్ 21 - ది ఆల్టో నైట్స్ (జియో హాట్ స్టార్), హోస్టేజ్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ఫాల్ ఫర్ మీ (నెట్ ఫ్లిక్స్), వెల్ కం టు సడన్ డెడ్త్ (నెట్ ఫ్లిక్స్), వన్ హిట్ వండర్ (నెట్ ఫ్లిక్స్), గోల్డ్ రష్ గ్యాంగ్ (నెట్ ఫ్లిక్స్), పీస్ మేకర్ సీజన్ 2 (వెబ్ సిరీస్ - జియో హాట్ స్టార్)
ఆగస్ట్ 22 - తలైవన్ తలైవి (ప్రైమ్ వీడియో), మారీశన్ (నెట్ ఫ్లిక్స్), కొత్తపల్లిలో ఒకప్పుడు (ఆహా), ఎఫ్ 1 (ప్రైమ్ వీడియో), పీస్ మేకర్ (సీజన్ 2 - జియో హాట్ స్టార్), హాట్ మిల్క్ (MUBI), Aema (కొరియన్ వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), అబాండన్డ్ మ్యాన్ (నెట్ ఫ్లిక్స్), నైట్ ఆఫ్ ద జూపకలిప్స్ (Peacock), రోడ్ ఆన్ ఏ మిలియన్ సీజన్ 2 (వెబ్ సిరీస్ - ప్రైమ్ వీడియో)
ఆగస్ట్ 23 - ఆన్ స్విఫ్ట్ హార్సెస్ (నెట్ ఫ్లిక్స్)
ఆగస్ట్ 24 - ది కిల్లర్ (నెట్ ఫ్లిక్స్)





















