Allu Arjun Rashmika: అల్లు అర్జున్... రష్మిక... 'పుష్ప' తర్వాత మరోసారి పాన్ ఇండియా సినిమాలో జోడీగా!
Allu Arjun Rashmika Movies: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలది సూపర్ హిట్ జోడి. ఇప్పుడు మరోసారి వాళ్లు జంటగా నటించినున్నారని సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నాలది బ్లాక్ బస్టర్ జోడి. పుష్పరాజ్ పాత్రలో బన్నీ, శ్రీవల్లిగా రష్మిక... వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి, వాళ్ళ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'పుష్ప 2' అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ విజయం తర్వాత మరోసారి బన్నీ, రష్మిక జంటగా నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో రష్మిక?
Rashmika In AA22xA6: 'పుష్ప 2' విజయం తర్వాత అల్లు అర్జున్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తీసిన 'జవాన్' విజయం తర్వాత దర్శకుడు అట్లీ కుమార్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. ఆ విషయం అందరికీ తెలుసు. ఆమె నటిస్తున్న విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా! దీపికా కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లకు సినిమాలో చోటు ఉంది. ఆ కథానాయికలు ఎవరు? అని కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులలోనూ ఆసక్తి ఉంది.
బన్నీ జంటగా నటించే అవకాశాన్ని మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే అందుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు వాళ్ళు ముగ్గురూ కాకుండా కొత్తగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది.
అల్లు అర్జున్, అట్లీ సినిమాలోని ముగ్గురు కథానాయికలలో ఒకరుగా రష్మిక ఎంపిక అయ్యారనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ ఖబర్. 'పుష్ప' జోడీని రిపీట్ చేయడానికి అట్లీ, మరోసారి రష్మికతో నటించేందుకు అల్లు అర్జున్ మొగ్గు చూపించారట. అన్నీ కుదిరితే త్వరలో ఈ జంట మళ్ళీ నటిస్తున్నట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

హీరోగా అల్లు అర్జున్ 22వ చిత్రమిది. దర్శకుడిగా అట్లీ ఆరో చిత్రమిది. అందుకని AA22xA6 ని వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. కళానిధి మారన్ నిర్మాత. ఇందులో హాలీవుడ్ హీరో ఒకరు విలన్ రోల్ చేసే ఛాన్స్ ఉంది.





















