అన్వేషించండి

Rangabali Movie: నాగశౌర్య 'రంగబలి' మూవీ డిజిటల్ రైట్స్‌ ఆ ఓటీటీకే!

పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వచ్చిన రంగబలి సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.,

Rangabali : నాగ శౌర్య నటించిన ప్యాకర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'రంగబలి' శుక్రవారం (జూలై 7) థియేటర్లలోకి వచ్చింది. సత్య కామెడీ, నాగశౌర్య హీరోయిజంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘రంగబలి’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఆన్ లైన్ లోకి వస్తుందన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ థియేట్రికల్ విడుదలైన కొన్ని వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుందని మాత్రం స్పష్టమవుతోంది. 

ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రంగబలి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందులో భాగంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అంటే 'రంగబలి' ఆగస్టు 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

కామెడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రంగబలి'కి సంబంధించి ఇంతకుమునుపే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ టాకే ఉంది. అయితే ఈ రోజు ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమర్షియల్ పాట్‌బాయిలర్‌పై శౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అదే నమ్మకంతో, ఉత్సాహంతో దూకుడుగా సినిమాను ప్రమోట్ చేశాడు. 

'రంగబలి' ఎలా ఉందంటే..

'రంగబలి' అంటూ వచ్చిన ఈ లోకల్ యాక్షన్ డ్రామాలో కొన్ని కామెడీ సన్నివేశాలు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే, కథాకథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, కొన్ని చోట్ల ప్లే స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన 'రంగబలి'కి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచి కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌నే సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నాయి. ఇక ఈ టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక 'రంగబలి' సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చగా.. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఆమెతో పాటు ఈ సినిమాలో. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రలు చేశారు.

Read Also : Manchu Lakshmi: ఈ విషయంలో నాన్న మనసు మారాలని యాదాద్రిలో మొక్కుకున్నా: మంచు లక్ష్మి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget