అన్వేషించండి

Manchu Lakshmi: ఈ విషయంలో నాన్న మనసు మారాలని యాదాద్రిలో మొక్కుకున్నా: మంచు లక్ష్మి

ఇటీవలే మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని, కానీ మంచు లక్ష్మీనే తండ్రిని ఒప్పించి తమ్ముడికి దగ్గరుండి పెళ్లి చేసింది. అయితే తాజాగా...

Manchu Lakshmi: టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. మోహన్ బాబు సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ కూతురు లక్ష్మీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ వైపు కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని, కానీ లక్ష్మీనే తండ్రిని ఒప్పించి తమ్ముడికి దగ్గరుండి పెళ్లి చేసింది అనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మంచు లక్ష్మీ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. 

వాళ్ల పెళ్లి జరగాలని యాదాద్రిలో మొక్కుకున్నాను: మంచు లక్ష్మీ

మంచు మనోజ్-మౌనిక ల పెళ్లిలో ప్రధాన పాత్ర పోషించింది లక్ష్మీ. మొదట్నుంచీ పెళ్ళి జరిగే వరకూ అన్నీ తానై చూసుకుంది. అయితే ఈ విషయంపై వచ్చిన పలు మీడియా కథనాల మీద తాజా ఇంటర్వ్యూలో స్పందించిందామె. మనోజ్ పెళ్లి విషయంలో తమ కుటుంబంలో మనస్పర్థలు వచ్చినమాట నిజమేనని అంది. అయితే తర్వాత మెల్లగా అన్నీ సర్దుకున్నాయని చెప్పింది. మనోజ్-మౌనిక ల పెళ్లి జరగాలని తాను యాదాద్రిలో మొక్కుకున్నానని చెప్పింది. తన తండ్రి మనసు మార్చాలని దేవుడిని కోరానని తెలిపింది. ఆ దేవుడు ఆలకించాడని, మనోజ్ పెళ్లి జరిగిందని తెలిపింది. 

పెళ్లికి ముందు నా దగ్గరే ఉన్నారు

మనోజ్ పెళ్లి విషయంలో తమ రెండు కుటుంబాలలో చాలా ఈక్వేషన్స్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. వాళ్ల ప్రేమ గురించి తెలియడం, నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనే సందేహాలు రెండు ఫ్యామిలీస్ లో ఉన్నాయని అంది. నిజంగా వాళ్లు ప్రేమించుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు, ప్రేమకు ఏదీ అతీతం కాదు కదా అని వాళ్ల పెళ్లి తన ఇంటి వద్దే చేశానని చెప్పింది. పెళ్ళికి ముందు కూడా వాళ్లు ఇద్దరూ తన వద్దే ఉన్నారని, పెళ్లి తర్వాత వేరే ఇల్లు తీసుకున్నారని తెలిపింది లక్ష్మీ.  

అన్నీ ఇప్పుడు అడుగుతుంది, నేను ఆటపట్టిస్తున్నా

మనోజ్ తనకు ఏ కష్టం వచ్చినా తానే ముందుండేవాడని, అందుకే తన ప్రేమకు తాను అండగా నిలబడ్డానని చెప్పింది లక్ష్మీ. మౌనిక అప్పుడప్పుడూ తనకు ఫోన్ లు చేసి వంటల గురించి అడుగుతుందని, ఏది ఎంత వేయాలి, ఎలా చేయాలి అడుగుతుందని తాను చెప్పకుండా ఆటపట్టిస్తున్నానని నవ్వుతూ చెప్పింది. 

పిల్లలంటే ఇష్టం, రాజకీయాల మీద ఆసక్తి లేదు

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది లక్ష్మీ. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పింది. తాము కూడా ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకున్నానమని, అయితే దేవుడు తమకు ఒక అమ్మాయినే ఇచ్చాడని అంది. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తనకు రాజకీయాల మీద అంతగా ఆసక్తి లేదని చెప్పింది లక్ష్మీ. కానీ సేవా కార్యక్రమాలంటే ఇష్టమని తెలిపింది. 

Also Read: రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ విడిపోతున్నారా - ఆ వీడియో దేనికి సంకేతం?

టాప్ హెడ్ లైన్స్

Renu Desai Reaction : అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
Illu Illalu Pillalu Serial Today November 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 10:రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌
నువ్వులేక నేను లేను: రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌
Podarillu Serial Today NoV 10: బైక్ షాపుకు పేరుపెట్టడం కోసం చిటీలు వేసిన కుటుంబం..శైలూ కోపానికి కారణం ఏంటి..? గండం నుచి కేశవ్‌ ఎలా గట్టెక్కాడు..?
పొదరిల్లు: బైక్ షాపుకు పేరుపెట్టడం కోసం చిటీలు వేసిన కుటుంబం..శైలూ కోపానికి కారణం ఏంటి..? గండం నుచి కేశవ్‌ ఎలా గట్టెక్కాడు..?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Embed widget