Rashmika Mandanna: రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ విడిపోతున్నారా - ఆ వీడియో దేనికి సంకేతం?
ఎప్పటినుంచో రష్మిక, విజయ్ దేవరకొండలు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో రష్మిక, విజయ్ విడిపోతున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గానే ఉంటుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు నెట్టింట వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై వాళ్లు ఇద్దరూ బహిరంగంగా ప్రకటించలేదు. వాళ్ల డేటింగ్ గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. అయినా ఒక్కోసారి వీరి మాటలు, సోషల్ మీడియాలో పోస్ట్ లు చూస్తే అది నిజమేనా అనే అనుమానం కలగకమానదు. అయితే తాజాగా రష్మిక షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో విడిపోవడం గురించి చెప్పే ఓ ఇన్స్పిరేషనల్ వీడియోను షేర్ చేసింది.
రష్మిక వీడియో వైరల్-విజయ్ తో లవ్ ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్..
సినిమాల్లో కాకుండా సోషల్ మీడియాలోనూ రష్మిక, విజయ్ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అంతా సోషల్ మీడియాలో ట్రెంట్ అవుతాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో నెటిజన్స్ వాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ పై అప్డేట్ గా ఉంటారు. వారి డేటింగ్ సంబంధించినట్టు ఏం కనబడినా దాన్ని ఇట్టే వైరల్ చేసేస్తారు. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియోను కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో విజయ్, రష్మిక విడిపోయారని అందుకే రష్మిక ఈ వీడియో షేర్ చేసింది అంటున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 'విడిపోవడం' గురించి ఓ ఇన్స్పిరేషనల్ వీడియోను షేర్ చేసింది. దీంతో రష్మికకు ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్. రష్మిక, విజయ్ విడిపోతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ..
రష్మిక, విజయ్ లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై వాళ్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ప్రయివేట్ కార్యక్రమాలు, టూర్ లలో ఒక్కోసారి ఇద్దరూ కలసి కనిపిస్తూ ఉంటారు. ఇదే విషయమై రష్మికను అడిగితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరిపై రూమర్స్ ఆగడం లేదు. ఇటీవలే రష్మిక, విజయ్ తమ ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ కనిపించారు. అది జరిగి కొన్ని రోజులు కూడా గడవక ముందే రష్మిక విడిపోవడం గురించి ఓ వీడియోను షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
‘పుష్ప 2’, ‘యానిమల్’ తో బిజీగా..
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది రష్మిక. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ కూడా నటించగా, సాయి పల్లవి కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా, రష్మిక పైప్ లైన్‌లో ‘యానిమల్’ మూవీ కూడా ఉంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ మూవీకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.
Also Read: కమల్ హాసన్ టైటిల్‌తో తెలుగులోకి ఉదయనిధి స్టాలిన్ 'మామన్నన్' - రిలీజ్ ఎప్పుడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

