Ram Charan: ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్ - బీస్ట్ మోడ్‌లో గ్లోబల్ స్టార్, ఆర్‌సీ 16 లోడింగ్...
Ram Charan in Beast Mode: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు. ఇటీవల గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన ఆర్‌సీ 16 కోసం మేకోవర్ అయ్యే పనిలో పడ్డాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చాడు. ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న చరణ్, త్వరలోనే RC16 షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చరణ్ మేకోవర్ అవుతున్నాడట. తాజాగా RC16 లోడింగ్ అంటూ క్రేజ్ ఫోటో షేర్ చేశాడు. కాగా చరణ్ చివరిగా 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో అలరించాడు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్న ఇంతవరకు ఈ మెగా పవర్ స్టార్ నుంచి మరో సినిమా లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు.
ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ స్లో స్లోగా జరుపుకుంటుంది ఇటీవల పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది. ఈ సినిమా చరణ్ 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఆర్‌సీ16 (RC16) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం మేకోవర్ అవుతున్న చెర్రి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ శివోహంతో ఫోటో షేర్ చేశాడు.
View this post on Instagram
ఈ ఫోటోకి "బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఆర్‌సీ 16 లోడింగ్"(Beast mode on RC16 loading… @shivohamofficial) అంటూ ఫోటో షేర్ చేశాడు. ఆర్‌సీ 16 కోసం ప్రముఖ సెలబ్రిటీ ట్రైయినర్ శివోహం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నట్టు చరణ్ పేర్కొన్నాడు. ఇందులో చరణ్ లుక్ చాలా పవర్ఫుల్‌గా కనిపించబోతున్నాడట. పాత్రకు తగ్గట్టు తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసుకునే పని పడ్డాడు చరణ్. ఇందుకు ప్రత్యేకంగా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ట్రెయినర్ శివోహం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జిమ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకుంటున్న ఫొటో షేర్ చేశాడు. ఇందులో చరణ్ జిమ్ వేర్‌లో కనిపించాడు.
దీనికి బీస్ట్ మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ ఇచ్చి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఆర్‌సీ 16 కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. చరణ్ బీస్ట్ లుక్‌లో ఇమాజిన్ చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. కాగా RC16లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో మిగతా తారాగణంపై త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఇక వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.
Also Read: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్